బెజ‌వాడ‌కు కేసీఆర్ తో కేటీఆర్ ఎందుకెళ్లిన‌ట్లు?

Update: 2019-06-17 11:33 GMT
ఒక కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అయితే.. ఇది మీడియా దృష్టిని పెద్ద‌గా ఆక‌ర్షించ‌లేదు. ఇప్ప‌టికిప్పుడు కాకున్నా రానున్న రోజుల్లో ఈ అంశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేచే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి. కీల‌క‌ భేటీల కోసం వివిధ రాష్ట్రాల‌కు వెళ్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు కొంద‌రు టీఆర్ ఎస్ నేత‌లు క‌నిపిస్తుంటారు. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా.. టూర్ కు త‌గ్గ‌ట్లు కేసీఆర్ వెంట వ‌చ్చే నేత‌లు మారిపోతుంటారు.

మిగిలిన నేత‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. కేసీఆర్  వ్య‌వ‌హారాల్ని ద‌గ్గ‌రుండి చూసే రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్ మాత్రం ప్ర‌తి టూర్లోనూ క‌నిపిస్తుంటారు. ఆయ‌న లేకుండా టూర్ల‌కు కేసీఆర్ వెళ్ల‌టం చాలా అరుదుగా సాగుతుంది. తాజాగా బెజ‌వాడ టూర్ కు వ‌చ్చిన కేసీఆర్ వెంట కూడా ఎప్ప‌టిలానే ప‌లువురు టీఆర్ ఎస్ నేత‌లు ఉన్నారు.

అంద‌రు ఒక ఎత్తు.. కేసీఆర్ వెంట ఆయ‌న కుమారుడు క‌మ్ టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తాను టూర్ల‌కు వెళ్లే వేళ‌లో కుమారుడు కేటీఆర్ ను వెంట తీసుకెళ్ల‌టం పెద్ద‌గా క‌నిపించ‌దు. అందుకు భిన్నంగా తాజాగా వైఎస్ జ‌గ‌న్ టూర్ కు మాత్రం కొడుకును వెంట బెట్టుకెళ్లిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఎందుక‌ని త‌న‌తో పాటు కేటీఆర్ ను బెజ‌వాడ‌కు తీసుకెళ్లారు? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. కీల‌క అంశాల విష‌యాల్లో త‌న త‌ర్వాత త‌న ప్లేస్ ను భ‌ర్తీ చేసే కేటీఆర్ కు.. పార్టీకి సంబంధించిన విష‌యాలతో పాటు.. ఇతర విష‌యాల మీద కూడాఅవ‌గాహ‌న తెచ్చేందుకు వీలుగా కేటీఆర్ ను తీసుకెళ్లిన‌ట్లుగా భావిస్తున్నారు. త్వ‌ర‌లో సీఎం ప‌గ్గాలు అందించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా చెబుతున్న కేసీఆర్‌.. త‌న కొడుక్కి.. జ‌గ‌న్ కు మ‌ధ్య మ‌రింత సన్నిహిత సంబంధాల్ని పెంచేందుకు వీలుగా తాజా టూర్ కు తీసుకొచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

భ‌విష్య‌త్తులో ఇద్ద‌రు యువ‌నేత‌లు క‌లిసి చేయాల్సిన ప‌నులు చాలానే ఉంటాయ‌న్న ఉద్దేశంతో.. వారి మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డేందుకు వీలుగా కేసీఆర్ తాజా ట్రిప్ కు త‌న‌తో పాటు కేటీఆర్ ను కూడా తెచ్చి ఉంటార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News