ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ ముంబై స్టార్ ఆల్ రౌండర్
ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా దుబాయ్ నుంచి అనుమతి లేకుండా అధిక బంగారం, కొన్ని విలువైన వస్తువులు తీసుకొచ్చి ముంబై ఎయిర్పోర్ట్ అధికారులకు దొరికినట్టు సమాచారం. అధికారులు పాండ్యాను విచారిస్తున్నారు. ఐపీఎల్-13 సీజన్ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరిన ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ క్రునాల్ పాండ్యాను ఎయిర్పోర్ట్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. అయితే అతడి వద్ద ఖరీదైన వాచీలు, కొంతబంగారం ఉండటంతో క్రునాల్ను అధికారులు ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు.
తమ కార్యాలయంలోకి తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే చట్టాలమీద అవగాహన లేకపోవడం వల్ల తాను వీటిని తీసుకొచ్చానని క్రునాల్ అధికారులకు చెప్పినట్టు సమాచారం. ఇటీవల క్రునాల్ తన సోదరుడు హార్థిక్పాండ్యాతో కలిసి షాపింగ్ చేశారు. అప్పుడు వాళ్లిద్దరు కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. క్రునాల్ వద్ద రెండు రోలెక్స్ వాచీలు, మరో రెండు ఖరీదైన వాచీలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటి విలువ రూ. 75 లక్షల కంటే ఎక్కువేనని సమాచారం. యూఏఈ నుంచి అనుమతి లేకుండా వస్తువులు తీసుకురావడంతో అతడిని తనిఖీ చేసినట్టు సమాచారం.
ఐపీఎల్ సీజన్ ముగియగానే క్రునాల్, హార్థిక్ పాండ్యాతో కలిసి షాపింగ్ చేశారు. వీళ్లిద్దరూ కొన్ని వాచీలు, కొంతబంగారం కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే హార్థిక ఆస్ట్రేలియా టూర్కు ఎంపికకావడంతో తోటి క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అతడు బంగారం, వస్తువులను కూడా క్రునాల్ తీసుకురావడంతో అధికారులు తనిఖీ చేశారు. తనకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో ఇలా తీసుకొచ్చానని క్రునాల్ వివరణ ఇచ్చినట్టు సమాచారం. చివరకు అతడి బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. షాపింగ్ సంబంధించిన పత్రాలు చూపించడంతోపాటు 60 శాతం ఫైన్ కట్టడంతో క్రునాల్కు వస్తువులను తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.