• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రెబెల్ + రెబెల్ ......

రెబెల్ + రెబెల్ ... ఓట్లు రాలడం నిజమేనా?

By - Tupaki Desk
Update: 2018-04-09 09:49 GMT
కర్నాటకలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి.. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణంలో మార్పు వస్తున్నదనే ప్రచారానికి చెక్ పెట్టాలని భారతీయ జనతా పార్టీ నాయకులు నానా కష్టాలు పడుతున్నారు. కర్నాటక ఎన్నికల బరిలో తమకు ఆశ పుట్టించే ఏ చిన్న అవకాశం దొరికినా వారు దానిని చేజార్చుకోవడం లేదు. చివరికి కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టేసిన... ఒకనాటి సినీ నటుడు - ప్రస్తుతానికి మాజీ మంత్రి అంబరీష్ ను భాజపాలో చేర్చుకుని ఎన్నికల సమరంలో ముందుకు వెళ్లాలని ఆశపడుతుండడం చిత్రంగా కనిపిస్తోంది.

కర్నాటక రాష్ట్రంలో ఒకనాటి సినీ హీరో అంబరీష్  కు అక్కడ రెబెల్ స్టార్ గా పేరుంది. అదే తరహాలో తెలుగునాట రెబెల్ స్టార్ ఇమేజి ఉన్న కృష్ణం రాజు భాజపా నాయకుడే. ఆయన పేరుకు రెబెల్ స్టారే గానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఓట్లు రాల్చగల ఇమేజిని ఆయన ఎన్నడో కోల్పోయారు.

అలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగు రెబెల్ స్టార్ - ఆ కన్నడ రెబెల్ స్టార్ తో మంతనాలు జరిపి  పార్టీలోకి వచ్చేలా సెట్ చేశారని వార్తలు వస్తున్నాయి. తెలుగు రెబెల్ స్టార్ కన్నడ సీమలో ఎన్నికల ప్రచార బాద్యతలు కూడా పార్టీ తరఫున పర్యవేక్షిస్తున్నాడండోయ్. జోగీ జోగీ రాసుకుంటూ బూడిద రాలుతుందని సామెత! అలాగే రెబెల్ ప్లస్ రెబెల్ కలిస్తే.. వారి కళ్లలోంచి నిప్పులు రాలవచ్చేమో గానీ.. ఓట్లు రాలుతాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మోడీ పార్టీ అవినీతిని తాము ఎట్టి పరిస్తితుల్లోనూ సహించం అని సుద్దులు చెబుతుంటుంది. అలాంటిది.. కాంగ్రెస్ పార్టీనే అవినీతి ఆరోపణలపై మంత్రి పదవినుంచి తొలగించిన అంబరీష్ ను ఎలా అక్కున చేర్చుకుంటుంది అనే వాదన వినిపిస్తోంది. తాను సిఫారసు చేసిన నలుగురు అనుచరులకు టికెట్లు నిరాకరించారని.. అంబరీష్ కాంగ్రెస్ పై అలిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ నలుగురికీ పెద్దపీట వేయడానికి భాజపా సిద్ధంగానే ఉన్నదా.. స్థానికంగా పార్టీలో అసంతృప్తి రేగదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
Tags:    
  • Krishnam Raju 
  • Ambarish 
  • BJP 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS