• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా పాజిటివ్ అయినా...

కరోనా పాజిటివ్ అయినా కొత్తగూడెం డీఎస్పీ డిశ్చార్జ్‌... ఎలా చేసారంటే ?

By - Tupaki Desk
Update: 2020-04-11 05:15 GMT
కరోనా వ్యాధిసోకి ఆసుపత్రిలో చేరిన కొత్తగూడెం డీఎస్పీ షేక్ అలీ ఆరోగ్యానికి సంబంధించిన తుది నివేదిక రాకముందే ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జ్‌ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల నుంచి వైరస్ మోసుకొచ్చిన కొడుకుతో కలిసి ఊళ్లు తిరగడమేకాకుండా.. స్వతహాగా పోలీస్ అయి ఉండి, క్వారంటైన్ నిబంధనల్ని అతిక్రమించి, సస్పెండైయ్యాడు. అయితే , అయన మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. కరోనా తీవ్రత ఇంకా తగ్గకముందే ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.  

అసలు ఏం జరిగిందంటే ? కొడుకు ద్వారా వైరస్ సోకిన ఆయన, ఇన్నాళ్లూ హైదరాబాద్ లోని చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐసోలేషన్ గడువు ముగియడంతో ఆస్పత్రిలో అందరికీ టెస్టులు నిర్వహించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో సదరు డీఎస్పీకి నెగటివ్ అని తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. అయితే , ఆస్పత్రి సిబ్బంది లిస్టును రీచెక్ చేసుకోగా.. డీఎస్పీకి ఇంకా వ్యాధి తగ్గలేదని, ఆయన పాజిటివ్ పేషెంట్ అనే ఉన్నట్లు గుర్తించారు. సరిగ్గా డీఎస్పీ పేరుతోనే అదే ఆస్పత్రిలో మరో పేషెంట్ ఉండటంతో ఇద్దరి రిపోర్టులు తారుమారైనట్లు తెలుసుకున్నారు.

దీనితో వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నత అధికారులకి తెలుపగా ..కొత్తగూడెంలోని పోలీసులకు సమాచారం చేరవేశారు. దాంతో స్థానిక పోలీసులు అర్థరాత్రి దాటిన తర్వాత ఉరుకులు పరుగుల మీద డీఎస్పీ ఇంటికి వెళ్లారు. అప్పటికప్పుడు సేఫ్ గార్డ్స్ పెట్టించి, అంబులెన్స్ లో తిరిగి హైదరాబాద్ కు పంపారు. ఈసారి ఆయనను చెస్ట్ ఆస్పత్రికి కాకుండా గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా  నుంచి కోలుకోక ముందే పొరపాటున డిశ్చార్జ్ అయిన డీఎస్పీ.. ఆస్పత్రి నుంచి బయటికొచ్చినప్పటి నుంచి ఎవరెవర్ని కలిశాడు, ఏ వాహనంలో వెళ్లాడు, మధ్యలో ఏమేం చేశారు, ఇంట్లో ఎవరెవర్ని కలిశారు అనే విషయాల్ని అధికారులు ఆరా తీశారు. ముందు జాగ్రత్తగా వాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచాలని నిర్ణయించారు. అయితే ,  రిపోర్ట్స్ సరిగ్గా పరిశీలించకుండానే ఆయన్ను ఇంటికి పంపిన అధికారులపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    
  • Kothagudem DSP discharged and called back 
  • Kothagudem DSP discharged 
  • Kothagudem 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS