‘‘కొమన్’’ తుపాను ఉత్తరకోస్తాను ఊపేస్తుందా?

Update: 2015-07-31 04:45 GMT
బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. తుపానుగా మారిన దీనికి కొమన్ అనే పేరును నామకరణం చేశారు. ఈ పేరును థాయ్ లాండ్ ప్రతిపాదించింది. థాయ్ లాండ్ లో లభ్యమయ్యే విలువైన ఒక రాయి పేరు మీద తాజా తుపాను పేరుగా వ్యవహరిస్తారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరానికి అనుకొని ఉన్న ఈ తుపాను శుక్రవారం మరింత ముందుకు కదిలి హటియా.. సాండ్ విప్ సమీపంలోని తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొమన్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం.. విజయనగరం.. విశాఖపట్నం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దీని కారణంగా తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచొచ్చని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర మీద ప్రభావం చూపించే ఈ తుపాను కారణంగా గత కొద్దిరోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. తుపాను అన్న వెంటనే ఉత్తరాంధ్ర ప్రజలకు హుధూధ్ తుపాను గుర్తుకు రావటం సహజం. అయితే.. తాజా కొమన్ కు అంత సీన్ లేదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News