కోహ్లీ డెడికేషన్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. గాయమైనా క్రీజులోనే
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి డెడికేషన్‌కు మారుపేరు. కష్టాల్లో ఉన్నప్పుడు టీంను గాడిలోకి తీసుకెళ్లడం, సహచరులను సమన్వయం చేసుకోవడంలో విరాట్‌కు ఎవరూ సాటిరారు. ఒకసారి మైదానంలో విరాట్ దిగాడంటే అతడి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆటలో దూకుడుగా ఉండటం, ఎంత కష్టమొచ్చినా ఎదుర్కోవడంలో అతడు ముందుంటాడు. కీలక సమయాల్లో జట్టును ముందుండి నడిపిస్తుంటాడు . ప్రస్తుతం ఆస్ట్రేలియా- భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లీకి ఓ వైపు బొటనవేలుకు రక్తం వచ్చేలా గాయమైంది. ఫిజియో వచ్చి పరీక్షలు చేశారు.
అనంతరం యథావిధిగా ఆడాడు కోహ్లీ. అతడు డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కోహ్లీకి సపోర్ట్‌గా కామెంట్లు పెడుతున్నారు.ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ (డే/నైట్) తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (74: 180 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ చేశాడు. అయితే 61వ ఓవర్ మొదటి బంతికి సింగల్ తీసిన కోహ్లీ.. అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. అయితే కోహ్లీ హాఫ్ సెంచరీ చేయకముందే గాయానికి గురయ్యాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 43వ ఓవర్లో కోహ్లీ బొటనవెలికి గాయమైంది. బంతి కాస్తా కోహ్లీ కుడిచేయి బొటనవేలికి బలంగా తాకింది.
బొటనవేలుకు రక్తం వచ్చింది. చికిత్స తీసుకున్న కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఆపై హాఫ్ సెంచరీ చేశాడు. భారత్ తొలిరోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అయితే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీ టాస్ గెలిచిన చాలా టెస్టుల్లో గెలుపొందాడు. ఆ మ్యాచ్ కూడా గెలుస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.