తనలోని కొత్త టాలెంట్ గురించి చెప్పిన కిషన్ రెడ్డి
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల బరిలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రచారంలో అధికారపక్షానికి ధీటుగా ప్రచారం చేయటమే కాదు.. భావోద్వేగ అంశాల్ని టచ్ చేయటం ద్వారా..బీజేపీ నేతల వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో బీజేపీ సెంటర్ పాయింట్ గా మారటం.. తెలంగాణ అధికారపక్షానికి ప్రధాన ప్రత్యర్థిగా మారిన సంగతి తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో మహా దూకుడుగా వ్యవహరిస్తున్నారు బీజేపీ నేతలు. మరో రోజులో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని.. ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా.. విశేష ఆదరణ లభించిందన్నారు. ప్రజలు కోరుకున్న మార్పుబీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకుంటే తమదే విజయమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆయన..తమ అభ్యర్థులు.. కార్యకర్తలు ఇంటికి వచ్చినా రాకున్నా.. ఓటు వేసే విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖంలో.. మాటల్లో కళ అస్సలు కనిపించలేదన్నారు. దుబ్బాక.. హైదరాబాద్ కు పరిమితమైన బీజేపీ పోరాటాన్ని ఇకపై రాష్ట్రమంతా తీసుకెళతామన్నారు. ముఖం చూసినంతనే వారిలో ఏ కళ ఉంది? ఏ కళ లేదన్న కొత్త టాలెంట్ ఎప్పటి నుంచి వచ్చింది కిషన్ రెడ్డి జీ..?