• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్‌కు వెన్నుపోటు...

కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వ‌చ్చినా.. కేటీఆర్ ను చేర్చుకోం

By - Tupaki Desk
Update: 2022-11-04 17:30 GMT
తెలంగాణ ఎమ్మెల్యేలకు కోట్లు ఆశ‌చూపార‌నే కేసు వ్యవహారంలో సీఎం కేసీఆర్ వ్యవహారం.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బయటి వ్యక్తులతో బేరసారాలు చేయాల్సిన కర్మ తమ పార్టీకి పట్టలేదన్న ఆయన.. కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కేటీఆర్ వచ్చినా చేర్చుకోమన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

`టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో ఆ పార్టీ నేతల వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ కేసులో బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్‌ ఆరోపణలు చేస్తూ వీడియోలు ప్రదర్శించిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి స్పందించారు. డిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టే విధంగా వీడియోలో ఎక్కడా లేదని.. టీఆర్ ఎస్‌ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? అని కిషన్రెడ్డి ప్రశ్నించారు.

‘‘కేసీఆర్‌ ఊహాజనితమైన ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ. స్వామీజీలతో ఎక్కడైనా ప్రభుత్వాలు కూలిపోతాయా? ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నీతిమంతుడైనట్లు చెబుతున్నారు. తెలంగాణ రత్నాలని చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారు? మీరా ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లించేది? ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ పాత రికార్డులనే మళ్లీ తిరగతోడారు. తన అసహనం, ఆక్రోశం, అభద్రతా భావాన్ని మరోసారి ఆయన ఏకరువు పెట్టారు. తనకి తానే సీఎం పదవిని చులకన చేస్తూ మాట్లాడారు. బ్రోకర్ల ద్వారా నేతలను పార్టీలో చేర్పించుకునే అలవాటు మీకు ఉందేమో.. మాకు లేదు. నాలుగేళ్లుగా కేంద్రమంత్రిగా పనిచేస్తున్నా. తెలంగాణకు సంబంధించిన ఏ విషయమైనా పార్టీ అధిష్ఠానం మాతో సంప్రదిస్తుంది`` అని అన్నారు.

అంతేకాదు, టీఆర్ ఎస్ ప్రభుత్వం పడిపోవాలని త‌మ‌కు లేదన్నారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామ‌ని తెలిపారు. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు సీఎం కాలేరనే భయంతోనే ఇలా చిల్లర, జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన ఖర్ము త‌మ‌కు పట్టలేదన్నారు. కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కేటీఆర్ వచ్చినా మేం చేర్చుకోబోమ‌ని వెల్ల‌డించారు. ప్రజాస్వామ్య బద్ధంగానే మేం అధికారంలోకి వస్తామ‌న్నారు.

``నలుగురు ఆర్టిస్టులు కూర్చొని అందమైన అబద్ధాన్ని వీడియోల రూపంలో పెడితే తెలంగాణ ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారా? బయటి వ్యక్తితో బేరసారాలు జరపాల్సిన ఖర్మ మాకేంటి? రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవో ఇచ్చారు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో టీడీపీ ఏ విధంగా బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేసిందో.. ఇప్పుడు కేసీఆర్ కూడా తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మాట్లాడుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • BharatiyaJanataParty 
  • bjp 
  • TRS 
  • KishanReddy 
  • kcr 
  • latestnews 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS