కిమ్ సంచలనం.. పొగ తాగారో చచ్చారే!

Update: 2020-11-05 23:30 GMT
పొగ తాగనివాడు దున్న పోతై పుట్టును అని గిరీశం అన్నాడు. ఈ మాట ఉత్తరకొరియాలో ఉన్న నియంత కం అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇన్ స్పిరేషన్ గా తీసుకున్నాడో ఏమో కానీ.. ఆయన బహిరంగంగా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ కాల్చేవాడు. దేశంలోనూ స్వేచ్ఛనిచ్చాడు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రచారం ఉత్తరకొరియాలో ఎక్కువమంది ధూమపానం చేస్తారని తెలిసింది. అధ్యక్షుడే చైన్ స్మోకర్ కావడంతో అక్కడ పొగతాగడం ఇన్నాళ్లు విచ్చలవిడిగా సాగేది.

కిమ్ కు ఏ భోధి చెట్టుకింద జ్ఞానోదయం అయ్యిందో తెలియదు కానీ సడన్ గా ప్రజారోగ్యం గుర్తుకు వచ్చింది. ఏకంగా ఉత్తరకొరియా ప్రజల ఆరోగ్యం గుర్తుకు వచ్చింది. దీంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని కిమ్  నిషేధించారు. దీనిపై ఉత్తరకొరియా పీపుల్స్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.

రాజకీయ, విద్యాకేంద్రాలు, థియేటర్లు, మాల్స్, వైద్య, ప్రజారోగ్య  కేంద్రాల్లో బహిరంగ ధూమపానంపై నిషేధం విధిస్తే ఉత్తరకొరియా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద చైన్ స్మోకర్ అయిన కిమ్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరించింది. ఒక పొగ కాలిస్తే ఏం శిక్షలు వేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. అసలే కిమ్.. తెలుసుకదా చంపినా చంపేస్తాడు.. జాగ్రత్త అని ఉత్తరకొరియా ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News