ఘోరం: పొరుగింటి మహిళను చంపేసి... గుండెను వండుకుతున్నారు!!
కొన్ని ఘటనలు గగుర్పాటుకు గురి చేస్తాయి. ఇటీవల తెలంగాణలోని పెద్దపల్లిలో న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై పొడిచి చంపిన ఘటనను చాలా మంది చూడలేక పోయారు. ఈ వీడియో వైరల్ అయ్యాక.. చాలా మంది అసలు మనం మనుషులమే నా? అనే ప్రశ్న వేసుకుని.. ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ దేశంలో ఇలానే నడిరోడ్డుపై పొడిచి పొడిచి చంపిన ఘటనలు అనేకం జరిగాయి. ఇలాంటివి చూసినప్పుడే కాదు.. విన్నప్పుడు ఒక్కసారిగా మనసు ఆర్ద్రం అయిపోతుంది. కళ్లు చెమ్మగిల్లక మానవు. అయితే.. `ఇంతకు మించి`.. అన్న తరహాలో ఓ వ్యక్తి ఏకంగా.. కుటుంబ సభ్యులు కోరారని.. పొరుగు మహిళను చంపేసి.. ఆమె గుండెను వండి వారికి వడ్డించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను నివ్వెర పాటుకు గురి చేస్తోంది.
అమెరికాలోని ఓక్లహోమాలో తన పొరుగింటిలో ఒంటరిగా ఉండే మహిళను చంపి.. ఆమె శరీరం నుంచి గుండెను పెకలించి తన కుటుంబ సభ్యులకు వండిపెట్టాడు ఓ రాక్షసుడు. ప్రస్తుతం ఈ వార్త.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వైరల్ అవుతోంది. ఇలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటూ.. డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరు దుబాయ్‌లో మాదిరిగా కాల్చి చంపాలని కూడా కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మిన్నెసోటాలో నివాసముండే లారెన్స్ పాల్ అండర్సన్‌ను ఓక్లహోమాలో జరిగిన ఇద్దరి దారుణ హత్య ఘటనలో అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ కేసును ఓక్లహోమా స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఓఎస్‌బీఐ) అధికారులకు అప్పగించారు. ఓఎస్‌బీఐ విచారణ సమయంలోనే లారెన్స్ విస్తుపోయే విషయాలు చెప్పాడు.
ఆ ఇద్దరిని చంపింది తాను కాదని చెప్పిన లారెన్స్.. తన పొరుగింటి మహిళ ఆండ్రియా లిన్ బ్లాంకెన్‌షిప్(41)ను హత్య చేసింది మాత్రం తానేనని ఒప్పుకున్నాడు. ఆండ్రియాను చంపిన తర్వాత ఆమె గుండెను తన కుటుంబ సభ్యుల కోరిక మేరకు వండిపెట్టానని చెప్పాడు. ఇక ఇదే ఓక్లహోమాలోనే దారుణహత్యకు గురైన లియోన్ పై(67), అతని 4 సంవత్సరాల మనవరాలు కయోస్ యేట్స్ విషయమై ప్రస్తుతం లారెన్స్‌ను అధికారులు విచారిస్తున్నారు. లియోన్ పై నివాసం నుంచి ఈ నెల 9న 911కు వచ్చిన ఫోన్‌కాల్ వల్లే ఈ దారుణం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మిస్ట్రీ మర్డర్స్‌పై విచారణ కొనసాగుతోంది. అయితే.. నిందితుడిని మాతరం ఉరేయాలనే డిమాండ్ రావడం గమనార్హం.