కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు, కీలక నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టును రట్టు చేశారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి విదేశాల్లో సర్జరీలు చేయిస్తున్న పవన్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై మన దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు శ్రీలంకలోను కేసులు ఉన్నట్లు గుర్తించారు. వెస్ట్ జోన్ జాయింట్ సీపీ శ్రీనివాస్ కేసు వివరాలను మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ దాదాపు ముప్పై కేసుల్లో నిందితుడని, స్టాక్స్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయాడని చెప్పారు.
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తితో శ్రీనివాస్ తన కిడ్నీని అమ్ముకున్నట్లు తెలిపారు. 2013 నుండి శ్రీనివాస్ కిడ్నీ వ్యాపారం ప్రారంభించాడని, డాక్టర్‌కు రూ.15 లక్షలు, డోనర్‌కు రూ.5 లక్షలు వెళ్లేవని, నిందితుడు శ్రీనివాస్ రూ.5 లక్షల నుండి రూ.7 లక్షలు తీసుకుంటాడని చెప్పారు. ఇబ్బందుల్లో ఉండి, కిడ్నీలు అమ్ముకునే వారిని శ్రీలంకలోని నాలుగు ఆసుపత్రుల ద్వారా ఈ వ్యవహారం నడిపేవాడని, తొమ్మిది ఆపరేషన్లలో దగ్గరుండి పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు.
బంజారాహిల్స్‌లోని కమలాపురి కాలనీకి చెందిన నాగరాజు అనే వ్యక్తికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, భార్య అతనిని ఓ ఆసుపత్రికి డయాలసిస్ కోసం తీసుకు వచ్చిందని, వారిని శ్రీనివాస్ గమనించాడని, విదేశాల్లో మీ భర్తకు మంచి చికిత్స చేయిస్తానని నమ్మబలికి రూ.34 లక్షలు పలు దఫాలుగా వారి నుండి తీసుకొని, వారికి మళ్లీ కనిపించలేదని చెప్పారు. దీనికి సంబంధించి 2019 జూన్ నెలలో శ్రీనివాస్ పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదయినట్లు తెలిపారు.