విజయసాయి రెడ్డికి కీలక పదవి

Update: 2020-08-04 05:45 GMT
ఏపీలోని అధికార వైసీపీలో సీఎం జగన్ తర్వాత కీలక నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో కీలమైన పదవి లభించింది. ఆయనకు పార్లమెంట్ లో విశిష్టమైన పదవి దక్కింది.

తాజాగా రాజ్యసభకు నలుగురు వైసీపీ ఎంపీలు నామినేట్ కావడంతో ఆ పార్టీ బలం పెద్దల సభలో పెరిగింది. దీంతో రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. దీంతో బలం కారణంగా కీలకమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)లో వైసీపీకి స్థానం దక్కింది. దీంతో సభలో బీఏసీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక బిల్లులు, ప్రతిపాదనల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం దక్కింది.

బీఏసీ సభ్యులుగా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, మల్లికార్షున్ ఖర్గే, వివ్ ప్రతాప్ శుక్లా, విజయసాయిరెడ్డిలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నామినేట్ చేశారు.ఇక సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ సభ్యులుగా జీవీఎల్ నరసింహారావు, కే.ఆర్ సురేశ్ రెడ్డి నియమితులయ్యారు.

రాజ్యసభ నిర్వహణలో బీఏసీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విజయసాయిరెడ్డి సభ్యుడు కావడం వైసీపీకి బలంగా మారనుంది. కీలక బిల్లులు,సవరణలకు అవకాశం ఉంటుంది. ఏపీ బిల్లులకు ఆయన ఆమోదం పొందేలా చేయవచ్చు.
Tags:    

Similar News