• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేశినేని దుకాణం బంద్?

కేశినేని దుకాణం బంద్?

By - Tupaki Desk
Update: 2017-04-08 07:32 GMT
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బస్సు సర్వీసులకు పేరుగాంచిన  కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసివేశారు.  కేశినేని ట్రావెల్స్ అధినేత, తెలుగుదేశం ఎంపి కేశినేని నాని ఇటీవల కొద్ది కాలంగా తన ట్రావెల్స్ సంస్థను మూసివేస్తామని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పోటీ పెరిగిపోవడం, కుప్ప తెప్పలుగా ట్రావెల్స్ పెరిగిపోవడం  కారణంగా సంస్థ నష్టాలలో కూరుకుపోయిందని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. చెప్పినట్లే ఈ రోజు ఉదయం కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసివేశారు. బెజవాడలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద బోర్డును కూడా తొలగించారు.
    
కేశినేని ట్రావెల్సును బతికించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా అవి పారకపోవడంతో సంస్థను మూసివేశారు. హఠాత్తుగా ట్రావెల్స్‌ను మూసి వేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. చాలా ఏళ్లుగా కేశినేని ట్రావెల్స్‌ బస్సులు నడుస్తున్నాయి. దాదాపు 450 సర్వీసులను కేశినేని ట్రావెల్స్ నడుపుతోంది. అయితే అర్థరాత్రి నుంచి ట్రావెల్స్‌ను నిలిపివేశారు. విజయవాడతో పాటు ముఖ్యపట్టణాల్లోని కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలను మూసివేశారు.
    
కొద్దికాలంగా ట్రావెల్స్‌ను నడిపేందుకు కేశినేని సంస్థ ఆపసోపాలు పడుతోంది. కొన్నేళ్లుగా భారీ నష్టాలను మూటకట్టుకుంది. రేటింగ్‌ లోనూ చాలా వెనుకపడిపోయింది. ఒక దశలో ఏడు నెలల జీతాలు రాకపోవడంతో సిబ్బంది ధర్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితమే 170 బస్సులను నాని అమ్మేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే అధికార బలాన్ని ఉపయోగించి మిగిలిన ట్రావెల్స్‌ను దెబ్బకొట్టడం ద్వారా కేశినేని ట్రావెల్స్‌కు ఊపిరిపోయాలని నాని భావించారు. ఇందులో భాగంగానే రేటింగ్‌ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆరంజ్‌ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలంటూ విజయవాడ ఆర్‌ టీవో కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై కేశినేని నాని - బోండా ఉమా కలిసి దూసుకువెళ్లారు.  అయితే బాలసుబ్రమణ్యంపై దాడి విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవడం, ఆరంజ్ ట్రావెల్స్‌ కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంపీ అనుచరులు ఒత్తిడి తెచ్చారని బాలసుబ్రమణ్యం చెప్పడంతో కేశినేని నాని ఎత్తులు పారలేదు. ఆ సంఘటన తర్వాత కేశినేని ట్రావెల్స్ డొల్లతనంపై మరింత చర్చ జరిగింది.
    
ఈ నేపథ్యంలో ఇక సర్వీసులను నడపడం సాధ్యం కాదని భావించిన కేశినేని నాని… దాన్ని మూసివేశారు. నిజానికి వారం క్రితమే ట్రావెల్స్‌ మూసివేతపై కేశినేని ప్రకటన చేస్తారని భావించారు. కానీ అప్పుడు చంద్రబాబు ఫోన్ చేసి పిలిపించుకుని ట్రావెల్స్‌ను మూసి వేయవద్దని నానికి సూచించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో  నాని చివరకు ట్రావెల్స్‌ ను మూసివేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kesineni Nani 
  • Kesineni Travels 
  • Kesineni Travels Closed 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS