• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పీవీపీకి ఇదే మైనస్.....

పీవీపీకి ఇదే మైనస్.. నానికి ప్లస్!

By - Tupaki Desk
Update: 2019-04-03 07:57 GMT
లోకల్ ఫ్యాక్టర్.. స్థానికత ఎప్పుడూ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంటుంది.  తమకు దగ్గరగా ఉండి.. తమ సమస్యలు పరిష్కరించేవారినే జనాలు గెలిపిస్తుంటారు. ఇక్కడివాడైనా ఎక్కడో సెటిల్ అయ్యి కోట్లు సంపాదించి.. కన్న ఊరుకు ఏమీ చేయలేని వారిని ఆదరించరు. అది ఎన్నో ఎన్నికల్లో స్వయంగా నిరూపితమైంది.

2009 ఎన్నికల్లో చిరంజీవికి ఈ తత్వం బోధపడింది. తను పుట్టిపెరిగిన పాలకొల్లులో పోటీచేసినా కానీ ఆయనను గెలిపించకుండా స్థానికురాలైన మహిళా ఎమ్మెల్యేనే గెలిపించారు. చిరు ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరుకు అందుబాటులో ఉండకపోవడం.. ఇక్కడ ఏమీ చేయకపోవడంతో ఆయనకు ఓటమి తప్పలేదు.

ఇప్పుడు ఇదే లోకల్ ఫ్యాక్టర్ విజయవాడ ఎంపీగా బరిలో దిగిన పీవీపీకి చుక్కలు చూపిస్తోంది. స్వయానా విజయవాడ వాసి అయినా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యి కోట్లకు పడగలెత్తిన పీవీపీ సొంత ఊరుకు చేసిందేమీ లేదని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సంచలన కామెంట్లతో ప్రచారంలో ఇరుకుపెడుతున్నాడు. సినిమాల్లో సంపాదించిందంతా హైదరాబాద్ లోనే పెట్టాడని.. ఆయన నాన్ లోకల్ అంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తున్నాడు. దీంతో విజయవాడ ఎంపీ సీటులో వైసీపీకి ఇదే పెద్ద మైనస్ గా మారింది.

ఇక పీవీపీ 2014 ఎన్నికల్లో పోటీచేయడానికి ముందుగా టీడీపీ-జనసేన అలయన్స్ లో పవన్ ద్వారా టికెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించారు. అక్కడ వీలుకాకపోవడంతో ఇప్పుడు వైసీపీలో చేరి టికెట్ పొందారు. దీంతో జనసేన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పీవీపీని టార్గెట్ చేసి అభాసుపాలుచేస్తున్నారు. జనసేన ఫ్యాక్టర్ కూడా వైసీపీ అభ్యర్థి పీవీపీకి శాపంగా మారింది.

పైగా రాజకీయాల్లో అనుభవం లేకపోవడం.. వ్యాపారవేత్తగా విశేషంగా రాణించి.. ఆ డబ్బు, పరపతితోనే వైసీపీ సీటు సంపాదించడం కూడా పీవీపీకి జనంలో ఇమేజ్ లేకుండా చేస్తోంది.  పైగా పీవీపీ గెలిచినా స్థానికంగా ఉండడని జనాలు బాగా నమ్ముతున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన పీవీపీ కేవలం ఎంపీగా గెలుపు కోసమే వైసీపీలో చేరారని.. గెలిచాక ఇక్కడికి తిరిగి చూస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే లోకల్ గా మాస్ లీడర్, జనాలకు అందుబాటులో ఉండే కేశినేని నాని వైపే మొగ్గు చూపిస్తున్నారన్న వాదన వినిపడుతోంది. కేశినేని టీడీపీ లో ఉండడం.. పైగా స్థానికుడు కావడంతో ఆయనకు కాస్త ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. చూడాలి మరి బలమైన పీవీపీ ఇన్ని ఇబ్బందుల మధ్య ఎలా నెగ్గుకు వస్తాడో.. 
    

Tags:    
  • PVP 
  • Kesineni Nani 
  • Vijayawada MP Candidate 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS