ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కేరళ వాసికి చోటు
కరోనా సమయంలో అతను చేసిన ఓ మంచి పని అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. కేరళకు సంబంధించిన కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి తాజాగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖలో జూనియర్ క్లర్క్ గా పని చేస్తున్న కృష్ణ ప్రసాద్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకోవడానికి గల కారణం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల్లో ఒకరైన కృష్ణ ప్రసాద్, తన ఫేస్ బుక్ పేజీలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు అన్ని వివరాలను ఇస్తూ కరోనా కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఫేస్ బుక్ పేజ్ లో పొందుపరిచిన కారణంగా ఆయనకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు.
ఏప్రిల్ 2020లో కరోనా మహమ్మారి గురించి గణాంకాలను ఒక అభిరుచిగా సేకరించడం ప్రారంభించిన కృష్ణ ప్రసాద్ తరువాత, కరోనా కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం దృష్టి పెట్టారు. దీనితో ఆయన అన్ని వివరాలను ఫేస్బుక్ పేజీలో రోజువారి తప్పకుండా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు 10,800 కి పైగా కరోనా మహమ్మారికి సంబంధించిన అప్‌డేట్‌లను పోస్ట్ చేశారు. టీకా స్లాట్లు, బెడ్ లభ్యత వంటి వివరాలను, మొత్తం కేసులు , కోలుకున్న రోగుల సంఖ్య తో పాటు అన్ని రకాల కరోనా సమాచారాన్ని వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఆయన అందించారు. కేరళ రాష్ట్రంలో మహమ్మారికి సంబంధించిన అన్ని వివరాలను తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేశారు. ఇక కృష్ణ ప్రసాద్ అందించే సమాచారానికి లక్ష మందికి పైగా ప్రజలు ఆసక్తి కనబరిచి, ఆయన పేజ్ ను ఫాలో అవుతున్నారు.
కరోనా మహమ్మారిపై ముఖ్యమైన వైద్య పత్రికలతోపాటు, అందుబాటులో ఉన్న శాస్త్రీయ పత్రాలను కృష్ణప్రసాద్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేశారు. కరోనా మహమ్మారికి సంబంధించిన అనేక అనుమానాలకు ఆయన తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా నివృత్తి సూచించారు. ఒకపక్క వృత్తి ధర్మాన్ని, మరోపక్క సామాజిక బాధ్యతను రెండిటినీ నిర్వర్తించారు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ క్లర్క్ గా పనిచేస్తున్న కృష్ణ ప్రసాద్, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగంలో బిజీగా ఉన్నానని , కాబట్టి, రాత్రి సమయాలలో కరోనా కు సంబంధించిన సమాచారాన్ని రెగ్యులర్ గా అప్ డేట్ చేశానని వెల్లడించారు.
దేశ విదేశాల నుండి చాలామంది వైద్యనిపుణులు, డేటా నిపుణులు తనను ప్రోత్సహించారని, వారు ఇచ్చిన సమాచారాన్ని కూడా తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా అందరికీ తెలియజేశానని కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్తగా కరోనా కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించడంలో ఆయన చేసిన కృషిని మెచ్చుకున్న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కృష్ణ ప్రసాద్ కు స్థానం కల్పించింది. ఆగస్టు 3వ తేదీన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కేరళకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ జూనియర్ క్లర్క్ కృష్ణ ప్రసాద్ స్థానం ఇచ్చింది.