పేదలకు ఉచితంగా ఇంటర్నెట్.. సీఎం ప్రకటన

Update: 2020-05-31 06:52 GMT
తినడానికి తిండి లేకున్నా సరే.. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరూ ఉండడం లేదు. ప్రతీ మనిషికి అది స్మార్ట్ ఫోనో.. లేక ఫీచర్ ఫోనో కానీ ఏదో ఒకటి ఉంటోంది. ప్రతి పేదవాడికి కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ కోసం వివిధ పనుల కోసం ఫోన్ నిత్యావసరంగా మారింది.  ఫోన్ తోనే అన్ని పనులు చేసుకుంటున్న వారు పెరిగిపోయారు.

ఇక ఫోన్ తోపాటు జియో రాకతో దేశంలో డిజిటల్ విప్లవం వచ్చేసింది. ఇంటర్నెట్ వినియోగం ఊహకందని రీతిలో పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో పేదలందరికీ ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. అది మన తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రకటన కాదు.. కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన ఈ ప్రకటన కేరళ వాసులనే కాదు.. దేశ ప్రజలందరినీ ఆకట్టుకుంది.

అక్షరాస్యత విషయంలో దేశంలోనే నంబర్ 1గా ఉన్న కేరళ రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 20 లక్షల కుటుంబాలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ను ఇవ్వనున్నట్టు కేరళ సీఎం ప్రకటించారు. ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ ప్రాజెక్టును డిసెంబర్ వరకు పూర్తి చేసి కేరళలోని పేదలందరికీ ఉచితం ఇంటర్నెట్ అందిస్తానని తెలిపాడు.  ఇందుకోసం 1548 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 2020 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్నారు.

కేరళలో ఇంటర్నెట్ కనెక్షన్ పొందడం పౌరుల ప్రాథమిక హక్కుగా కేరళ సీఎం విజయన్ అభివర్ణించారు.  పేదలకు ఉచితంగా.. ఇతరులకు వేర్వేరు ధరల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కేరళ సీఎం తెలిపారు.

    

Tags:    

Similar News