ఈసారి కేసీఆర్ యాదాద్రి పర్యటన అధికారికం కాదా?
తిరుమలకు మించి తెలంగాణలో దేవాలయాన్ని నిర్మించాలన్న పట్టుదలతో వందల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ రాష్ట్ర సర్కారు యాదాద్రిలో ఆలయాన్ని నిర్మిస్తున్న వైనం తెలిసిందే. దేశంలో మరే ప్రభుత్వం కూడా ప్రజల పన్నులతో వచ్చిన ఆదాయంతో ఒక మతానికి చెందిన ప్రార్థనాలయానికి ఇంత భారీగా ఖర్చు చేసిందా? అంటే అనుమానమే. తనకు తోచినంతనే యాదాద్రికి వెళ్లే ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
వచ్చే నెల నాలుగున ఆయన యాదాద్రి సందర్శించనున్నట్లు చెబుతున్నారు. యాదాద్రికిఎప్పుడు వెళ్లిన ఒకింత హడావుడి.. హంగామా కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా తాజా టూర్ మాత్రం చాలా సింఫుల్ గా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికనే. మరి.. కోడ్ కూసిన వేళ యాదాద్రికి సీఎం వెళ్లటం సరైనదేనా? అంటే కాదనే చెప్పాలి.
కాకుంటే.. మూడు నెలల వ్యవధిలో ఉద్ఘాటనకు ముహుర్తం నిర్ణయించాల్సి ఉండటంతో.. ఆలయ పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాన్ని తానే స్వయంగా చూడాలన్న పట్టుదలతోనే సీఎం కేసీఆర్ ఆలయానికి వెళుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. కోడ్ అమల్లోకి వచ్చినందున.. ఈసారి తన పర్యటనను వీలైనంత తక్కువ హడావుడితో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు.. ఈసారి ఆయనది అధికారిక పర్యటన కాదని.. అనధికారికంగా చెబుతున్నారు. అనధికారిక హోదాలో యాదాద్రికి వెళ్లనున్న కేసీఆర్ పరిమిత సంఖ్యలోనే అధికారుల్ని కలవనున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వెళ్లకుంటే.. పనులు జరిగే విషయంలో జాప్యం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఆయన వెళుతున్నట్లు చెబుతున్నారు.