టార్గెట్ పీఎం..ఎట్‌ లీస్ట్ డిప్యూటీ!

Update: 2019-01-18 06:58 GMT
ఎవ‌రిది ఈ టార్గెట్ అనుకుంటున్నారా... ఇంకెవ‌రు కేసీఆర్‌. ఆశ్చర్యపోతున్నారా... ముమ్మాటికి నిజం. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టార్గెట్ ఇదే. ప్రస్తుతం సీనియర్ నాయకులలో తనకు ఈ అర్హతలు ఉన్నాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. జాతీయ స్దాయిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ కు ప్రత్యామ్నయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కె చంద్రశేఖర రావు తన ప్రయత్నాలు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇదే పనిలో ఉన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలను కూడగట్టి తృతీయ శక్తిగా అవతరించాలని మమతా బెనర్జీ - కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు సైతం ఈ ప్రయత్నాలలో భాగం అవుతున్నారు. అయితే ఆయన కేసీఆర్‌ తో కలిసే అవకాశాలు లేవు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ తో కలసి కూటమి ఏర్పాటు చేయాలనుకోవడం మమతా బెనర్జీకి మింగుడు పడడం లేదు. దీంతో మమతా బెనర్జీ కేసీఆర్ తో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వారిద్దరు వైఎస్‌ ఆర్ సీపీ - అన్నాడీఎంకే - మాయవతి - అఖిలేష్‌ వీరంతా కలసి బీజేపీ - కాంగ్రెసేతర ఫ్రంట్‌ గా ఏర్పడే అవకాశం ఉంది.

ఈ ఫ్రంట్ ఏర్పడితే - తెలుగు రాష్ట్రాలలో 42 లోక్‌ సభ స్దానాలకు 40 వరకూ గెలుచుకోగలిగితే కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని కేసీఆర్ ఆశిస్తున్నారు. ఎక్కువ స్దానాలను కైవసం చేసుకుని ప్రధాని పదవికి పోటీ పడాలన్నది కె. చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ ప్రధాని పదవికి మమతా బెనర్జీ అడ్డు పడితే కనీసం ఉప ప్రధాని పదవి అయినా తీసుకోవాలన్నది కేసీఆర్ లక్ష్యంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇతర పక్షాలను కూడా ఒప్పించాలన్నది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. ఫరూక్ అబ్దులా - అఖిలేష్ యాదవ్ వంటి వారితో నిరంతరం టచ్‌ లో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ కు సహకరించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి కారణం బీజేపీ ‍‍‍‍‍హయాంలో జరిగిన రాఫెల్ యుద్ద విమానాల స్కాం బయట పడకూడదన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి టార్గెట్ పీఎం లేదు డిప్యూటీ సాధించేందుకు కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News