మాంద్యం ఎఫెక్ట్ సారు సర్కారు మీద ఎంతలా పడిందంటే?
మాంద్యం మాట తరచూ వినిపిస్తూనే ఉంది. అధినేతలు.. మీడియా చెబుతున్నట్లుగా మాంద్యం తీవ్రత ఎంతన్నది పక్కన పెడితే.. ఆ పేరుతో ప్రభుత్వాలు చేసుకుంటున్న దిద్దుబాట్లు అంతా ఇంతా కాదు. ఎక్కడిదాకానో ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్నే చూస్తే.. డాబు కోసం భారీగా పెంచేసిన బడ్జెట్ గణాంకాల కారణంగా తీవ్ర ఇబ్బందులు.. ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మాంద్యం పేరుతో ఆ మధ్య ప్రవేశ పెట్టిన బడ్జెట్ సైజును తగ్గించుకోవటం ద్వారా.. గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే దిశగా అడుగులు వేశారు.
ఇదే కాదు.. మాంద్యం పేరు చెప్పి.. తెలంగాణ సర్కారు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందంటున్నారు. ఇటీవల కాలంలో రావాల్సినంత ఆదాయం రాకపోవటం.. చేసిన అప్పులకు చెల్లించాల్సిన చెల్లింపులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. గతంలో చెప్పిన ప్రాజెక్టులు.. నిర్మాణ పనులకు రానున్న రోజుల్లో ఎలాంటి టెండర్లు పిలవకూడదని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన అత్యవసర సందేశాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ విభాగాలకు పంపినట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు నిధుల లోటు లేకుండా ఉండాలంటే.. వివిధ పనులు.. ప్రాజెక్టులు.. నిర్మాణ పనులకు బ్రేకులు వేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. మాంద్యం నుంచి బయటపడే వరకూ ఇదే విధానాన్ని అమలు చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. పలు పనులు ఆగిపోతాయి.
అదే జరిగితే అనుకున్న ప్రకారం పనులు పూర్తి అయ్యే అవకాశం లేదని చెప్పాలి. తాజాగా పంపిన అత్యవసర సందేశం కారణంగా సాగునీటి.. పంచాయితీరాజ్.. రహదారులు.. భవనాలు లాంటి కీలక శాఖల్లో రూ.25వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు బ్రేకులు పడినట్లే. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించి మిడ్ మానేరు దిగువన ఉన్న మల్లన్నసాగర్ వరకూ అదనపు మూడో టీఎంసీ నీటిని పైప్ లైన్ వ్యవస్థ ద్వారా తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆగిపోనుంది.
ఇదే తీరులో దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వల్ని పెంచేందుకు అవసరమైన కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి బ్రేకులు పడతాయి. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు నాలుగు వరుసల లైన్లతో కూడిన రోడ్ల నిర్మాణ పనులు ఆగిపోనున్నాయి. ఇలా.. పలు పనులకు బ్రేకులు పడటం ఖాయమని చెప్పక తప్పదు. ఒక్కసారిగా పనులన్ని ఆగిపోవటం ద్వారా.. ప్రభుత్వ వ్యవస్థల్లో స్తబ్దత నెలకొనటమే కాదు.. పనులు ముందుకు సాగకపోవటంతో ఇచ్చిన హామీల్ని సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొనటం ఖాయం.