కేసీఆర్ సిటీకి వచ్చేశారు.. మరి కంటి ఆపరేషనో?
దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. అధికారిక కార్యక్రమంతో పాటు.. వ్యక్తిగత పని మీద ఢిల్లీకి వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి హైదరాబాద్ కు వచ్చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో కీలక భూమిక పోషించి.. వాస్తు ప్రకారం ఆయన్ను కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ దే.
ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన ఆయన.. బిజిబిజీగా గడిపారు. కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆపరేషన్ కు రెఢీ అయ్యారు. అయితే.. ఆయనకు బీపీ.. షుగర్ లెవెల్స్ పెరగటం సమస్యగా మారింది. అవి అనుకున్న స్థాయికి రాకపోవటం.. కేసీఆర్ కు ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ సచిదేవ్ అందుబాటులో లేకపోవటంతో.. ఆయనకు చేయాల్సిన శస్త్రచికిత్సను వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే.. కంటి ఆపరేషన్ వాయిదా పడటానికి రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ అన్న ప్రచారం సాగుతోంది. ఆయన ఈనెల 2న తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కంటి ఆపరేషన్ ను వాయిదా వేసుకున్నట్లుగా చెబుతున్నారు. కంటి ఆపరేషన్ చేయించుకుంటే కనీసం వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని.. అదే జరిగితే కోవింద్ తెలంగాణ పర్యటన సందర్భంగా తాను కలిసే అవకాశం లేకపోవటంతో ఆపరేషన్ వాయిదా వేసుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం.
ఇక.. ఈ రోజు (శుక్రవారం) రాత్రి పార్లమెంటు హాలులో జరగనున్న జీఎస్టీ ప్రత్యేక భేటీకి ముఖ్యమంత్రులందరిని పిలుస్తున్నట్లుగా ముందుగా అనుకున్నారు.అయితే.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టాలని మోడీ సర్కారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్నట్లుగా సీఎం కేసీఆర్ కు ఇన్విటేషన్ అందలేదంటున్నారు. కేసీఆర్ తో సహా మరెవరినీ పిలవని నేపథ్యంలో.. ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/