టాప్ క్రిమినల్ కేసుల లిస్టులో కేసీఆర్ నెం.5: ఏడీఆర్ షాకింగ్ రిపోర్ట్స్

Update: 2022-07-13 10:30 GMT
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నేతల నేర చరితలు బయటపడ్డాయి. ప్రజాప్రతినిధులపై ఎన్ని క్రిమినల్ కేసులున్నాయో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. ఈమేరకు ఓ నివేదికను బయట పెట్టింది. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేందుకు అర్హులు.

ఈ సందర్భంగా ఓటేయబోయే వారిపై ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాన్ని తెలిపింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా ఉండడం గమనార్హం. ఏడీఆర్ నివేదిక ప్రకారం కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే దీశంలోని  తొలి ఐదుగురిలోనే కేసీఆర్ పేరు ఉండడంపై చర్చనీయాంశంగా మారింది.

ప్రతీ సంవత్సరం సందర్భాన్ని భట్టి ఏడీఆర్ రాజకీయ నేతలపై ఉన్న చరిత్రను బయటపెడుతుంది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు కలిసి తాజాగా ఓ రిపోర్టును బయటపెట్టాయి.

దేశంలోని ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో మొదటిస్థానంలో కేరళ ఎంపీ డీన్ కురియకోన్ ఉన్నారు. ఈయనపై 204 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత డీఎంకే ఎంపీ ఎఉస్. కతిరవన్ 99 కేసులు, ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ అజం ఖాన్ 87, తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్ బేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత ఐదో స్థానంలో కేసీఆర్ పై 64 కేసులు ఉన్నాయి.
Read more!

ఏడీఆర్ రిపోర్టు ప్రకారం  కేసీఆర్ పై నమోదైన కేసుల్లో 37 తీవ్రమైన ఐపీఎస్ సెక్షన్లు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. ఇందులో 13 నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన అభియోగాలు, ప్రభుత్వ ఉద్యోగిని విధులను అడ్డుకోవడం, గాయపరచడానికి ప్రయత్నించిన 4 అభియోగాలు, హత్యా ప్రయత్నానికి సంబంధించిన 3 అభియోగాలు, ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడానికి సంబందించి 3 ఆరోపణలు ఉన్నాయి.

ఇక ఎవరైనా ఒక వ్యక్తి నుంచి దొంగతనం లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించి హాని కలిగించిన నేరాలు 3 ఉన్నాయి. ఇవే కాకుండా భాష, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామర్య పరిరక్షణకు విఘాతం కలిగించడం లాంటి మొత్తం కలిపి 64 కేసులు నమోదయ్యాయి. ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ సంస్థలు దేశంలోని మొత్తం 4809 మంది అఫిడవిట్ లో 4759 అధ్యయనం చేవాయి. రాష్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మొత్తం 4759 మంది ప్రజాప్రతినిధుల డేటాను బయటపెట్టాయి. ఇందులో 10 శాతం మంది మహిళలు కూడా ఉన్నారు.
Tags:    

Similar News