ఎన్నికల వేళ కేసీఆర్ కీలక నిర్ణయం

Update: 2019-04-23 11:06 GMT
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. కానీ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయించారు.

తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్న 48 మంది ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం పదోన్నతలును కల్పించింది. ఇందులో 26మంది ఐఏఎస్ - 23మంది ఐపీఎస్ లు ఉన్నట్లు సమాచారం. ఈ పదోన్నతులకు సంబంధించి 15జీవోలను ప్రభుత్వం జారీ చేసింది.

26మంది ఐఏఎస్ లలో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. వీరితోపాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.

23మంది ఐపీఎస్ లలో ఐదుగురికి అదనపు డీజీలుగా ప్రమోషన్ లభించింది. నలుగురు ఐపీఎస్ లకు ఐజీ - ఏడుగురు ఐపీఎస్ లకు డీఐజీ - ఆరుగురికి సీనియర్ స్కేల్ పదోన్నతులు ఇచ్చింది.

కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈసీ అనుమతి తీసుకున్నామని చెబుతుండగా.. త్వరలో జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల కోడ్ ఉండగా ఈ నిర్ణయం అధికార పార్టీకి మేలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అధికారులను మచ్చి క చేసుకోవడానికే ఈ బదిలీలు చేస్తున్నారని ప్రమోషన్లు ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Tags:    

Similar News