• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ‌డిలో బాబ్రీ కూల్చివేత...

బ‌డిలో బాబ్రీ కూల్చివేత స్కిట్‌..సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌రచ్చ‌

By - Tupaki Desk
Update: 2019-12-16 17:33 GMT
అయోధ్య లోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రదేశంలో రామమందిర నిర్మాణానికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు గత నెల 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సున్నిత‌మైన ఈ వివాదం - తీర్పు విష‌యంలో అంతా సంయ‌మ‌నం పాటిస్తున్న త‌రుణంలో...ఓ పాఠ‌శాల‌లో విద్యార్థుల నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని కల్కడలోని ఓ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాబ్రీ మసీదు కూల్చివేత స్కిట్ ను ప్రదర్శించారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కల్కడలో ఉన్న శ్రీరామ విద్యాకేంద్ర ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా - బాబ్రీ స్కిట్ ప్ర‌ద‌ర్శించారు.  మసీదు గుమ్మటానికి సంబంధించిన ఓ భారీ ఫ్లెక్సీని వేదిక మధ్యలో ఉంచి తెల్ల చొక్కాలు - కాషాయ రంగు ప్యాంట్లను ధరించి జై శ్రీరామ్ - జై వీర హనుమాన్.. అంటూ నినాదాలు చేస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత స్కిట్ ను ప్రదర్శించారు. బాబ్రీ మ‌సీదు ఉన్న ఫ్లెక్సీనీ  చింపేయడంతో ఈ స్కిట్ ముగుస్తుంది.

అయితే, ఈ నాట‌క‌మే వివాదాస్ప‌దం అంటే....ఈ స‌మ‌యంలోనే సంద‌ర్భాలు - పాఠ‌శాల నేప‌థ్యంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వార్షికోత్స‌వానికి బీజేపీ నేత‌ - కేంద్రమంత్రి సదానంద గౌడ - పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ముఖ్య అతిథులుగా విచ్చేయ‌డం..వారి సమ‌క్షంలోనే  ఈ వివాదాస్ప‌దం అంశం ప్ర‌ద‌ర్శితం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రోవైపు కల్కడ్క ప్రభాకర్ భట్ అనే పేరు మీద ఏర్పాటైన ఓ ట్రస్ట్ ఈ పాఠ‌శాల‌ను నిర్వ‌హిస్తోంది. ఆర్ ఎస్ ఎస్ కర్ణాటక శాఖ ద్వారా ఈ పాఠ‌శాల‌కు నిధులు అందుతున్నాయని - అందుకే ఇలా రెచ్చ‌గొట్టే ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ని ...ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    
  • Karnataka school 
  • RSS man 
  • kids 
  • Babri Masjid 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS