రెండు బ్యాడ్ న్యూస్ లు చెప్పిన కర్ణాటక మంత్రి!

Update: 2020-06-12 16:53 GMT
దేశంలో కరోనా ఉధృతి ఊహించిన దాని కంటే అధికంగా ఉంది. చైనాలో 90 వేల కేసులు వస్తే వామ్మో అని గుండెలు బాదుకున్నాం. ఇటలీలో రోజుకు 3 వేలు లెక్కతేలితో దేవుడా మనం సేఫ్ అనుకున్నాం. కానీ మనం రోజుకు పది వేలు లెక్కకడుతున్నాం. ఇదే భారీ అని మనం భయపడుతుంటే కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి బాంబు పేల్చారు.

ఇపుడేం చూశారు ఇంకా ముందుంది మొసళ్ల పండగ అంటున్నారు. ఆగస్టు 15 నాటికి కరోనా ఉధృతి కర్ణాటకలో తీవ్రంగా ఉండబోతోందని కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతం లో గ్రాఫ్ పెరుగుతున్న తీరు, మంత్రి చెప్పిన విషయాలు రెండూ కలిపి చూస్తే ఆగస్టు నాటికి దేశంలో రోజుకు 50 వేల కేసులు బయటపడే రోజు వస్తుందేమో.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. అయినా దానిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పనిలేదన్నారు. మరోవైపు ఆయన దేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రం వెల్లడించారు. కర్నాటకలో నమోదైన కేసుల్లో 97 శాతం రోగుల్లో వ్యాధి లక్షణాలేవీ లేవట. వ్యాధి లక్షణాలు ఇంత మందిలో కనిపించకపోవడం దేనికి సూచికో తెలుసా....మరింత వ్యాప్తికి సూచిక. ఎందుకంటే లక్షణాలు కనిపించకపోతే వారి ద్వారా ఇతరులకు వ్యాపించడాన్ని అడ్డుకోలేం.
Tags:    

Similar News