బ్రాహ్మణులూ గోమాంసం తినేవారంటున్న ఐలయ్య

Update: 2015-12-01 09:09 GMT
 తెలంగాణ రాష్ట్రానికి చెందిన దళిత హక్కుల కార్యకర్త, ప్రముఖ మేధావి కంచ ఐలయ్య హిందూ మతంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ పూజారులు సహా హిందువులు గోమాంసం తినేవారని చరిత్ర చెబుతోందని ఆయన అన్నారు. ఆపును పవిత్రమైనదిగా భావించేవారు దాన్ని హిందూత్వం అనరాదని.. ఆవుమతం అనాలని అన్నారు. టైమ్స్ లిటరేచర్ ఫెస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆవును పూజించడం.. గోమాంస వ్యతిరేక ప్రచారం 9వ శతాబ్దంలో మొదలైందని.. శంకరాచార్య దీన్ని ప్రారంభించారని చెప్పారు. అంతకుముందు గోమాంసాన్ని హిందువులు తినేవారని ఆయన చెప్పారు. ఆవు పాలు వినియోగించడం వల్లే దాన్ని పవిత్రమైనదిగా భావిస్తున్నారన్నారు. నిజానికి పాల వినియోగంలో 70 శాతం అవసరాలను గేదెలు తీరుస్తున్నాయని.. కానీ, ఆవును పూజిస్తున్నారని అన్న ఆయన.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 నుంచి ఆవును తొలగించాలని.. లేదంటే, ఆవుకు తోడుగా గేదెను కూడా పవిత్రమైనది చేర్చాలని డిమాండ్ చేశారు. గేదెలు నల్లగా ఉంటాయనే వాటిని పూజించడం లేదని.. వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని... పశువులనే సమానంగా చూడకపోవడం అనేది క్రమంగా మనుషుల్లో అసమానత్వానికి దారి తీసిందని పేర్కొన్నారు. సంప్రదాయాలు గురించి మాట్లాడే బ్రాహ్మణులు సంస్కృతం నేర్చుకుంటే సరిపోతుందని... బహుజనులంతా ఆంగ్లం నేర్చుకుంటారని ఆయన అన్నారు.
Tags:    

Similar News