రాజకీయాలకు కమల్ హాసన్ దూరమైనట్టేనా?

Update: 2021-12-04 07:30 GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ అప్పట్లో మళ్లీ యాక్టివ్ అయిపోయారు. కానీ ఇప్పుడు రాజకీయాలను అస్సలు పట్టించుకోవడం లేదట.. తన భవిష్యత్ ప్రణాళికలపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా.. నీతిగా నిజాయితీ పాలిటిక్స్ అంటూ వెళ్లిన కమల్ కు ఘోర ఓటమి ఎదురైంది.

పారదర్శక పార్టీగా మాత్రం కమల్ ఘనత పొందారు. ఇప్పుడు కమల్ ఈ గుణపాఠంతో ఇక రాజకీయాలకు దూరంగా జరగడమే బెటర్ అని డిసైడ్ అయినట్టు తమిళనాట మీడియా కోడైకూస్తోంది.. సినిమాల వరకే పరిమితం కావాలని అనుకుంటున్నట్టు సమాచారం.

కమల్ హాసన్ ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చారు. జనాలు ఆదరిస్తారని పోటీచేశారు. కానీ పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు.

గెలుపు అవకాశాలే కనపడలేదు. తాజాగా కరోనా వైరస్ బారినపడ్డ కమల్ కు పూర్తి విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారట.. ఆస్పత్రి నుంచి కమల్ 4వ తేదీన డిశ్చార్జ్ అవుతున్నా మరికొద్దిరోజుల పాటు ఎవరిని కలవడని సమాచారం. దాంతో జనవరిలో తమిళనాడులో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీచేయబోదని అర్థమైంది.

ఓవైపు కమల్ హాసేన్ ఓటు బ్యాంకు పడిపోతోందని.. మరోవైపు పుంజుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఓట్ల శాతం పెరిగింది లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. దీంతో స్థానిక సంస్థల్లో పోటీకి కమల్ దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

ఇక కమల్ పై వయసు ప్రభావం కూడా తీవ్రంగా కనపడుతోంది. వీటన్నింటి కారణంగానే ప్రస్తుతం కమల్ రాజకీయాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్టు పార్టీ ప్రచార విభాగం ప్రకటించింది. అంటే కమల్ ప్రస్తుతానికి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లేనని సమాచారం.

మొత్తం మీద కమల్ హాసన్ చేతులు కాలాక ఇప్పుడు పార్టీని చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. దశల వారీగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరగాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

పోయిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీచేశారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షుడు వనాతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. దీంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కమల్ కోరిక తీరకుండాపోయింది. ఇప్పుడు రాజకీయాలకే దూరంగా జరిగే పరిస్థితి నెలకొంది.


Tags:    

Similar News