• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సజ్జన్నార్ కు ‘తెలుగు’...

సజ్జన్నార్ కు ‘తెలుగు’ రాదా? జస్టిస్ సిర్పుర్కర్ విచారణలో కీలక వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2021-10-13 03:31 GMT
‘దిశ’ ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఎదుట హాజరైన నాటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ పెద్ద ఎత్తున ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో విచారణను ఎదుర్కొన్న వారిలో ఆయనకే ఎక్కువ ప్రశ్నలు ఎదురైనట్లుగా చెప్పక తప్పదు. ఈ సందర్భంగా సజ్జన్నార్ తెలుగు భాషా ప్రావీణ్యం మీదా విచారణలో భాగంగా ప్రశ్నలు ఎదుర్కోవటం గమనార్హం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగును తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే  పొరపాటు పడి ఉంటానని విచారణలో వ్యాఖ్యానించటం కీలకంగా మారింది. దీనికి ఆయన్ను కమిషన్ ఒక ఆసక్తికర ప్రశ్నను సంధించింది. ‘తెలుగు రాష్ట్రానానికి ఐపీఎస్ గా ఎంపికైనప్పుడు ఆ భాషలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి కదా?’ అని అడిగితే అవునని చెప్పారు. అలాంటప్పుడు ఇన్ని రోజులు తెలుగు అర్థం చేసుకోకుండానే విధులు నిర్వర్తిస్తున్నారా? అంటూ కమిషన్ ప్రశ్నించింది.

దీనికి బదులిచ్చిన సజ్జన్నార్.. తన మాత్రభాష కన్నడకు తెలుగుకు దగ్గరి సంబంధం ఉండటంతోతనకు తెలుగు రాయటం.. చదవటం తెలుసని.. మాట్లాడటమే పూర్తిగా తెలీదని వ్యాఖ్యానించటం గమనార్హం. రెండు రోజుల పాటు సాగిన విచారణలో సజ్జన్నార్ ను కమిషన్ ఏకంగా 160 ప్రశ్నల్ని సంధించింది. మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

సజ్జన్నార్ చెప్పినట్లుగా ఆయనకు తెలుగు మాట్లాడటం అంతగా రాదా? అన్నది చర్చగా మారింది. ఆయన  గురించి వ్యక్తిగతంగా తెలిసిన వారు.. ఆయన చెప్పిన మాటల్లో పాక్షికంగా నిజం ఉందని చెబుతున్నారు. తెలుగులో స్పష్టంగా మాట్లాడే సజ్జన్నార్.. ఎవరైనా టిపికల్ తెలుగు మాట్లాడినా.. భాషకు సంబంధించి వివిధ ప్రాంతాల యాసల్ని అంత బాగా అర్థం చేసుకునే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. తెలుగు భాష తెలిసినప్పటికీ.. పూర్తిస్థాయిలో పట్టు లేదనే విషయం వాస్తవమే అన్న మాట ఆయన గురించి బాగా తెలిసిన వారు అభిప్రాయపడుతుండటం కనిపిస్తోంది.
Tags:    
  • sajjanar 
  • sajjanar comments 
  • Justice Sirpurkar 
  • Justice Sirpurkar about sajjanar 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS