నిజంః భార‌త్‌ కు మ‌ద్ద‌తిచ్చిన ముషర్ర‌ఫ్‌

Update: 2016-10-28 09:49 GMT
పర్వేజ్ ముషర్రఫ్....పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు. సొంత దేశం అయిన‌ప్ప‌టికీ  కీల‌క‌మైన అంశం విష‌యంలో త‌ను అధ్య‌క్షుడిగా ఉన్న పాకిస్తాన్‌ కు కాకుండా  దౌత్య‌నీతిలో స‌రైన విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న భార‌త‌దేశానికి మ‌ద్ద‌తుగా ముష‌ర్ర‌ఫ్ మాట్లాడారు. నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌ జైషే మహ్మద్ చీఫ్ మ‌సూద్‌ అజహర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పరిశీలనలో ఉంది. అయితే అతనికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్తూ, ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకుంటోంది. మసూద్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారతదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్‌ లోని ఓ టీవీ ఛానల్‌ తో ముష‌ర్ర‌ఫ్ మాట్లాడుతూ మసూద్ అజహర్ ఓ ఉగ్రవాది అని పేర్కొన్నారు.

పొరుగున ఉన్న‌ భార‌త‌దేశంలోనే కాకుండా మసూద్ పాకిస్తాన్‌ లో కూడా బాంబు దాడులకు పాల్పడ్డాడని ముష‌ర్ర‌ఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసూద్ అజహర్‌ తో సంబంధం లేని చైనా ఈ విష‌యంలో ఎందుకు జోక్యం చేసుకుంటోంద‌ని ప్ర‌శ్నించారు. ఉగ్ర‌వాదుల విష‌యంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వ దూకుడుగా వ్యవహరించడం లేదని ముష‌ర్ర‌ఫ్‌ ఆరోపించారు. అంతర్జాతీయంగా దౌత్యపరంగా పాకిస్థాన్ విఫలమైందని అంగీకరిస్తూనే పాకిస్థాన్‌ ను తేలిగ్గా తీసుకోకూడదని పేర్కొన్నారు. అయితే, అజహర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించేవిధంగా చేయాలని చైనాను పాకిస్థాన్ ఎందుకు కోరడం లేదన్న ప్రశ్నకు ముషర్రఫ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.  అయితే మసూద్ ఉగ్రవాది అని ముషర్రఫ్ చెప్పడంతో ఆయన భారత్‌ వాదనను సమర్థించినట్లయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News