జగన్ పట్టుదల.. స్థానిక ఎన్నికలు జరగవు: జేసీ

Update: 2020-11-18 15:45 GMT
అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలపై దూకుడుగా వెళుతున్న వ్యవహారంపై ఆయన స్పందించారు.

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఏపీలో కొలువుదీరిన జగన్ సర్కార్ నో చెప్పినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి గవర్నర్ ను కలవడం.. సీఎస్ కు లేఖ రాయడంపై జేసీ స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్న వైనం సరికాదని జేసీ అన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికల కమిషన్ ఒక్కటే ఎన్నికలు జరుపలేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎన్నికల నిర్వహణకు కావాల్సిన నిధులు, ఉద్యోగులను ప్రభుత్వమే సమకూర్చవలసి ఉంటుందని జేసీ హితవు పలికారు. అనుకున్నది జరగడానికి సీఎం జగన్ ఎంత దూరమైనా వెళ్తారని.. ఈ ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదని జేసీ పేర్కొన్నారు.

నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఏపీలో ఎన్నికలు నిర్వహించి తీరుతానని ప్రయత్నాలు చేయడంపై ఆయన నియామకం చేసిన టీడీపీ నేతల్లోనూ వ్యతిరేకత రావడం నిజంగా ఆశ్చర్యమని.. ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ వ్యవహరించవద్దని పలువురు వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News