• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గత్యంతరం లేక టీడీపీలో...

గత్యంతరం లేక టీడీపీలో ఉన్నా ..జేసీ దివాకర్ రెడ్డి!

By - Tupaki Desk
Update: 2021-03-17 10:58 GMT
పాత మిత్రులను కలుసుకునేందుకు తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాసేపు ముచ్చటించారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో జేసీ సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత  మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ.. 'మిత్రులందరినీ ఓసారి కలుద్దామనే అసెంబ్లీకి వచ్చాను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అక్కడా ఇక్కడా లేకుండా పోయింది. తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. వేరే దారి చూసుకోవాల్సిన అవసరం ఉంది.

నాగార్జున సాగర్‌లో జానారెడ్డి గెలువలేడు. ఆయన కొడుకు రఘు వస్తే జనం వీళ్ల వైపు చూసే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లింది. ఇంకో రెండేళ్ల తర్వాత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి నాగలి పట్టి వ్యవసాయం చేసుకోవాల్సిందే. రాజగోపాల్ రెడ్డి ఇంకో రెండు కాంట్రాక్టులు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయల తెలంగాణ కావాలని అప్పుడు నేను ఇక్కడి రెడ్డి నేతలకు చెప్పాను కానీ, ఎవరూ వినలేదు. చివరిదాకా జైపాల్ రెడ్డి కూడా రాయల తెలంగాణ అన్నారు. దీంతో అందరూ ఆయనను తెలంగాణ ద్రోహి అన్నారు. రాయల తెలంగాణ వచ్చి ఉంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని అయన అన్నారు.  కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఆశించి అధిష్ఠానం మీద ఒత్తిడి తెచ్చారని విమర్శించారు.  రాష్ట్ర విభజనతో మమ్మల్ని మెడపట్టి గెంటేశారు. దానివల్ల రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోయింది. ఛాలెంజ్‌ చేసి చెప్తున్నా.. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదు. ఆ పార్టీకి జీవకళ పోయింది. ఇప్పుడు తెలంగాణలో కంటే ఏపీలో దుర్మార్గపు పాలన సాగుతోంది. జాతీయ పార్టీలు మంచివి.. గత్యంతరం లేకనే ప్రాంతీయ పార్టీలో కొనసాగుతున్నాఅని జేసీ తెలిపారు. 
Tags:    
  • JC Divakar Reddy 
  • Chandrababu Naidu 
  • TDP 
  • Andhrapradesh 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS