నిజమే... జయలలిత ఆరోగ్యం బాగోలేదు

Update: 2015-07-29 07:43 GMT
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై కొద్ది రోజులుగా రకరకాలుగా ప్రచారమవుతోంది.. ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, కొద్దిరోజుల్లో విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటారని ఇటీవల ప్రచారం జరిగింది... అయితే.. ఆ వెంటనే అన్నా డీఎంకే వర్గాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అంతేకాదు... ఆ వార్త ప్రచురించిన రెడిఫ్.కామ్ కు నోటీసులు కూడా ఇచ్చారు. అంతేకాదు, ఆ వెబ్ సైట్ పై 100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. కానీ, అంతలోనే స్వయంగా జయలలితే తన ఆరోగ్యం బాగులేదంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. అమ్మకేమైందన్న ఆందోళన అటు కార్యకర్తలు, అభిమానుల్లోను... జయకు ఏమైందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లోనూ నెలకొంది.

తాను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరు కావడం లేదని జయలలిత కొద్దిసేపటి కింటే ప్రకటించారు. కలాంకు కడపటి వీడ్కోలు చెప్పాలని ఉన్నప్పటికీ తన ఆరోగ్యం సహకరించడం లేదనీ, అందుకే కలాం అంత్యక్రియలకు తాను హాజరు కాలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు. తన కేబినెట్ సహచరులు కలాం అంత్యక్రియలకు హాజరవుతారని జయలలిత పేర్కొన్నారు. తన తరఫున పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు వస్తారని ఆమె ప్రకటించడంతో తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. 'కలాంకు కడసారి వీడ్కోలు చెప్పాలని నాకూ ఉంది... కానీ.. అనారోగ్యం కారణంగా నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను' అని జయ ప్రకటన విడుదల చేశారు.

జయే స్వయంగా ఇలా ప్రకటన ఇచ్చేసరికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్న ఆందోళన తమిళనాట తీవ్రమైంది.
Tags:    

Similar News