జానారెడ్డి పశ్చాత్తాపం.. కాంగ్రెస్ బండారం బయటకు

Update: 2018-12-18 08:37 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత.. పెద్దలు అని అప్యాయంగా అందరూ పిలిచే జానారెడ్డి ఓటమితో మనస్థాపం చెందారు. వరుసగా 7 సార్లు గెలిచిన ఈ సీనియర్ కు టీఆర్ఎస్ హోరులో  పరాభావం తప్పలేదు..అయితే తన ఓటమిపై నియోజకవర్గం వారీగా జానారెడ్డి పోస్టుమార్టం నిర్వహించారట.. ఈ సందర్భంగా జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి.

ఎన్నికల ఫలితాల అనంతరం జానారెడ్డి నేతృత్వంలో మిర్యాలగూడలో కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. దీనికి మిర్యాల గూడలో పోటీచేసి ఓడిపోయిన ఆర్. కృష్ణయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. ‘ఒకరిపై ఒకరు ఇక నిందారోపణలు చేసుకోవద్దు.. సమష్టిగా గెలుపు కోసం కృషి చేయాలి. రానున్న రోజుల్లో పార్టీ గెలవాలంటే ఇది అవసరం.’ అని చెప్పుకొచ్చారు.  దీంతో ప్రస్తుత ఎన్నికల్లో  కాంగ్రెస్ ఓడిపోవడానికి గ్రూపు రాజకీయాలు ఉన్నాయని జానారెడ్డి మాటలను బట్టి తేటతెల్లమైంది.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఐదారుగురు ఈ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలయ్యారు. వీళ్లు తమ గెలుపుకోసం కంటే కాంగ్రెస్ లోని పోటీదారుల ఓటమికే ఎక్కువగా పనిచేయడం వారి కొంప ముంచింది. రేవంత్ రెడ్డి ఇలానే ఓడిపోయారు. ఇప్పుడు జానారెడ్డి నోటీ నుంచి వచ్చిన ఈ మాటలను బట్టి కాంగ్రెస్ నేతలు నిండా మునిగాక గానీ తత్వం బోధపడలేదన్నమాట..

ఇక ఇదే సమావేశంలో కేసీఆర్ పై కూడా జానారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ డబ్బుల సంచులు వెదజల్లి గెలిచిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ నోట్లకట్టలే తమ ఓటమికి కారణమని జానా వాపోయారు. ఇక నుంచి కలిసికట్టుగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
Tags:    

Similar News