• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగ్గారెడ్డికి...

జగ్గారెడ్డికి కోపమొచ్చింది.. రేవంత్ కూడా ఆ తప్పు చేయకూడదు కదా?

By - Tupaki Desk
Update: 2021-12-27 09:33 GMT
దొందూ దొందే అన్నట్లు ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు. తప్పు ఒకసారి జరిగితే ఫర్లేదు. పదే పదే జరగటం ఏ మాత్రం బాగోదు. బలమైన రాజకీయ ప్రత్యర్థి పోరాడే వేళలో.. కొన్ని తప్పులు చోటుచేసుకోకుండా ఉండటం చాలా అవసరం. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు తరచూ చేసే పొరపాట్లు వారిలోని అనైక్యతను బట్టబయలు చేసేలా ఉంటుంది. నిజానికి ఏ పార్టీలో అయినా అంతర్గత రచ్చ లేకుండా ఉంటుందా? కానీ.. అవేమీ బయటకు రావు. కాంగ్రెస్ మాత్రం మరెవరికీ అవకాశం ఇవ్వకుండావారికి వారే.. బయటకు చెప్పేసుకుంటూ ఉంటారు.

తాజాగా రేవంత్ - జగ్గారెడ్డి మధ్య మరోసారి పంచాయితీ మొదలైంది. ముఖ్యమంత్రికేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో ఈ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే కేసీఆర్ ఫాంహౌస్ లో వరి పండిస్తున్నారని.. సోమవారం మరిన్ని విషయాలు బయటపెడతానని చెప్పిన రేవంత్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ యాక్టివిటీలు తగ్గిపోయాయని.. ఎక్కడ చూసినా.. టీఆర్ఎస్ -బీజేపీ మధ్య లడాయి కనిపిస్తున్న వేళ.. రచ్చబండతో మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నారు.

అదిలోనే హంసపాదు అన్న రీతిలో రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిష్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి.. ఆ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాంటిది తనను సంప్రదించకుండానే రేవంత్ ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ ఆయన మండిపడుతున్నారు. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసిన జగ్గారెడ్డి.. తనతో చర్చించకుండానే రేవంత్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో తాను పాల్గొనని స్పష్టం చేశారు.

ఈ ఎపిసోడ్ లో రేవంత్ తప్పు ఎంతన్నది చూస్తే.. ఆయనకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టటం సుతారం ఇష్టం లేని సీనియర్ నేతల తీరు తెలిసిందే. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటూనే అందరిని కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ రేవంత్ అలాంటి పని ఎందుకు చేయటం లేదన్నది ఇప్పుడు ప్రశ్న. జగ్గారెడ్డి విషయానికి వస్తే.. రేవంత్ తనతో చర్చించకుండా రచ్చబండ కార్యక్రమాన్ని షురూ చేస్తే.. పార్టీ కోసం ఆయనతో కలిసి పని చేసి.. పార్టీ వేదికలో ఆయన తీరును తప్పు పట్టాలి. అందుకు భిన్నంగా ప్రకటనలు విడుదల చేస్తే.. పార్టీలోని లొల్లి రోడ్డు మీదకు వస్తుందన్న విషయాన్ని ఆయన ఎలా మర్చిపోతారు? కలుపుకుపోవాల్సిన రేవంత్ కలుపుకుపోకపోవటం.. కలుపుకు వెళ్లని రేవంత్ మీద జగ్గారెడ్డి గుస్సా కావటం దొందూ దొందే అన్నట్లుగా ఉందని చెప్పక తప్పదు.
Tags:    
  • JAGGA REDDY 
  • REVANTH REDDY 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS