• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణ పీసీసీకి డబ్బున్న...

తెలంగాణ పీసీసీకి డబ్బున్న నేతలే కావాలి

By - Tupaki Desk
Update: 2021-01-03 07:00 GMT
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే టి జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి శనివారం కొత్త పీసీసీ కమిటీ ఏర్పాటుపై వింత ప్రతిపాదనను హైకమాండ్ ముందు ఉంచారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈ మేరకు  బహిరంగ లేఖ రాశారు, ఎన్నికలలో పోరాడటానికి తగిన వనరులను సమీకరించగల కనీసం 25 మంది ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులను పిసిసి కమిటీలో నియమించాలని ఆ లేఖలో జగ్గారెడ్డి సూచించారు.

ఆర్థికంగా ప్రతి నాయకుడికి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించి, ఆ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి వారిని బాధ్యులుగా చేయాలని లేఖలో జగ్గారెడ్డి కోరారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ లేఖలో ట్విస్ట్ ఇచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో డబ్బు అనేది అంత ప్రాముఖ్యత పోషించలేదని.. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఓటర్లకు లంచం ఇచ్చే కొత్త సంస్కృతిని ప్రవేశపెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు.  50 శాతం డబ్బు పంపిణీ రూపంలో.. మిగిలిన 50 శాతం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల రూపంలో కేసీఆర్ ప్రజలకు పంచుతున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలో వివరించారు.

" రెండు దఫాలుగా ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రస్తుతం ఎన్నికలతో పోరాడటానికి డబ్బు ఉందా లేదా అని నాకు తెలియదు. ఎందుకంటే వారు వరుస ఎన్నికల కారణంగా దివాళా తీశారు. అందుకే, పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయడానికి ఒక కమిటీగా ఏర్పడితే పార్టీకి మేలు. ఆర్థికంగా బలమైన నాయకులు మాకు అవసరం ”అని జగ్గా రెడ్డి సూచించారు.

పిసిసి చీఫ్‌ను ఎన్నుకునేటప్పుడు సోషల్ మీడియా ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని సోనియా - రాహుల్ ను జగ్గారెడ్డి కోరారు.  కొంతమంది నాయకుల లాబీయింగ్‌కు లొంగకుండా ఉండాలని హైకమాండ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. "దయచేసి పార్టీకి నాయకుల దీర్ఘకాలిక విధేయత మరియు సీనియర్లను విశ్వాసంలోకి తీసుకునే వారి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని పీసీసీ చీఫ్ ను ఎన్నుకోండి" అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు.
Tags:    
  • Jagga Reddy 
  • TPCC 
  • Telugu News 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS