చంద్రబాబును డమ్మీని చేసే జగన్ మాస్టర్ ప్లాన్?

Update: 2019-12-12 08:53 GMT
కర్ర విరగకుండా పాము చావాలి? ఎలా చంపాలి..? జగన్ మాట తప్పకుండా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలి.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే   టీడీపీని వీడాలి.. ఆ పార్టీకి దెబ్బ పడాలి? ఎలా చేయాలి?  ఈ ఆలోచనల్లోంచే వైసీపీ అధినేత జగన్ లో ఓ మాస్టర్ ప్లాన్ వచ్చేసిందట.  వైసీపీ అధిష్టానం పెద్దలు శోధించి సాధించి చంద్రబాబును డమ్మీని చేసి ఆడించే ఒక కొత్త ఎత్తుగడను తెరపైకి తీసుకురాబోతున్నారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది.

తాజాగా అసెంబ్లీలో జనసేనకు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తిరుగుబాటు చేశారు. జగన్ కు మద్దతు తెలిపారు. కానీ ఆయనను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పవన్ ఉన్నారు. జనసేన తరుఫున ఆయన ఒక్కరే ఎమ్మెల్యే కావడంతో ఫిరాయింపులను చట్టబద్ధంగా చేయవచ్చు. వైసీపీలో విలీనం కావచ్చు. అసెంబ్లీలో జనసేన పార్టీకి కర్తకర్మ క్రియ రాపాకే కావడంతో జనసేనను వైసీపీలో విలీనం చేసే హక్కు ఆయనకే ఉంది. ఈ విషయంలో పవన్ ది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

ఇక అయితే జనసేన ఎమ్మెల్యే  రాపాక ప్రసాద్ విషయంలోనే  కాదు.. టీడీపీ నుంచి కనీసం పదిమంది ఎమ్మెల్యేలను ఇలాగే తీసుకోవాలని వైసీపీ అధిష్టానం స్కెచ్ గీసినట్టు తెలిసింది. ఈ మేరకు ప్లాన్ సిద్ధం చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే టీడీపీకి, అసెంబ్లీ సభ్యత్వానికి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు.కానీ స్పీకర్ వంశీ రాజీనామాను నిలిపివేశారు. దాంతో సాంకేతికంగా వంశీ టీడీపీలో లేడు. అందువల్ల తనకు టీడీపీ ఎమ్మెల్యేలకు దూరంగా వేరే సీటు కేటాయించాలని స్పీకర్ ను వంశీ  ఇటీవలే కోరాడు. ఈ మేరకు వంశీని టీడీపీ ఎమ్మెల్యేల నుంచి మినహాయించి ప్రత్యేక సీటును కేటాయించారు స్పీకర్ తమ్మినేని.

ఇప్పుడు ఈ ప్లాన్ నే వైసీపీ వర్కవుట్ చేస్తోందట.. దాదాపు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఇలాగే టీడీపీ నుంచి విడదీసి వారిని సపరేట్ గా కూర్చుండబెట్టి 10 మంది పూర్తయ్యాక వారితో టీడీపీని వైసీపీలో విలీనం చేయించాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు చర్చ జరుగుతోంది.

టీడీపీకి రాజీనామా చేస్తేనే వైసీపీలోకి తీసుకుంటానని అసెంబ్లీలో జగన్  ప్రకటించారు. పార్టీ ఫిరాయించిన వారిని సస్పెండ్ చేయండని స్పీకర్ ను కోరారు. అలా ఆ సిద్ధాంతాన్ని చెడకుండా టీడీపీని దెబ్బతీసే మాస్టర్ ప్లాన్ ఇదేనని భావిస్తున్నారు.
4

దీన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును వ్యతిరేకిస్తూ  రాజీనామాలు చేస్తారు. కానీ వారి రాజీనామాలు హోల్డ్ లో ఉంచుతారు. ఫలితంగా వారు టీడీపీ ఎమ్మెల్యేలు కారు.. వారిని అసెంబ్లీలో విడిగా వంశీలాగా కూర్చుండబెడుతారు. ఇలా 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి విడిపోయాక వారంతా తాము మెజార్టీ టీడీపీ ఫిరాయింపు దారులమని చెప్పి.. తమను వైసీపీలో విలీనం చేయాలని స్పీకర్ కు లేఖ ఇస్తారు. ఇలా మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో విలీనం అయితే అసెంబ్లీలో టీడీపీ ఉండదు. చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతు అవుతుంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాతో వచ్చిన కేబినెట్ హోదా ర్యాంకు పోయి డమ్మీ అయిపోతారు. ఇప్పుడు ఇదే ప్లాన్ ను వర్కవుట్ చేసేందుకు జగన్, వైసీపీ అధిష్టానం రెడీ అయ్యిందట.. సో ఇక తొందరలోనే చంద్రబాబు  ప్రతిపక్షహోదా అసెంబ్లీలో గల్లంతు అవుతోందన్నమాట..


- Dinakar

Tags:    

Similar News