• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'అమరావతి అక్రమాల'పై జగన్...

'అమరావతి అక్రమాల'పై జగన్ ప్రభుత్వ నివేదిక రెడీ?

By - Tupaki Desk
Update: 2019-10-17 14:30 GMT
గత ప్రభుత్వ హాయాంలోనే అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఆ మేరకు వివిధ అంశాలను తెర మీదకు తెచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం కొనసాగుతుందా? అనే నీలినీడలు కూడా నెలకొన్నాయి.  అయితే రాజధానిని మార్చే ఉద్దేశం తమకు లేదని జగన్ మొదటే చెప్పారు. అయితే అమరావతి విషయంలో జరిగిన అక్రమాలను బయటకు తీసుకురావడానికి మాత్రం జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

అందులో భాగంగా.. ఆ విషయంపై విచారణ కోసం ఒక కమిటీని నియమించింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక రెడీ అయ్యిందని సమాచారం. అది త్వరలోనే ముఖ్యమంత్రికి  అందబోతోందట. అందులో భాగంగా ఆ నివేదికలో పేర్కొన్న పలు అంశాలపై ప్రచారం మొదలైంది.

రాజధాని వ్యవహారం పెద్ద స్కామ్ అనడానికి పలు ఆధారాలు లభించాయని టాక్. అందులో ముఖ్యమైనది ఏమిటంటే..రాజధాని ఏరియాలో నిర్మాణాలకు చదరపు అడుగుకు పది వేల రూపాయల కేటాయించడం పెద్ద స్కామ్ అని నివేదికలో పేర్కొన్నారట. దేశంలో ఎక్కడా ఆ స్థాయిలో డబ్బులు చెల్లించింది లేదని, హైదరాబాద్, బెంగళూరులో.. స్థలం విలువతో కలుపుకున్నా.. నిర్మాణానికి చదరపు అడుగుకు ఐదు వేల రూపాయల మొత్తం ఖర్చు లేదని నివేదికలో పేర్కొన్నారట.

అయితే దేశంలో ఎక్కడా లేని రీతిలో చదరుపు అడుగుకు పది వేల రూపాయలను  కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్ల విషయంలో ధారాళంగా వ్యవహరించిందని నివేదికలో పేర్కొన్నారని టాక్. రాజధాని వ్యవహారం పెద్ద స్కామ్ అని చెప్పడానికి ఇది కీలక ఆధారంగా పేర్కొంటున్నారట.

ఇక డిజైన్లకు అంటూ కొన్ని వందల కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందట.  ఆ డబ్బును ఖర్చు పెడితే.. డైరెక్టుగా మంచి మంచి భవనాలను కట్టవచ్చని, అయితే చంద్రబాబు ప్రభుత్వం డిజైన్లకే వందల కోట్లరూపాయల ప్రజాధనాన్ని పోసిందని నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.  ఈ మేరకు నివేదిక రెడీ అయ్యిందని, అది ముఖ్యమంత్రిని చేరిన తర్వాత పూర్తి వివరాలు బయటకు రాబోతున్నట్టుగా సమాచారం!
Tags:    
  • Jagan 
  • Andhra Capital 
  • Amaravati 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS