• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ ఆడుతున్న గేమ్.....

జగన్ ఆడుతున్న గేమ్.. బాబుకు ముచ్చెమటలు..

By - Tupaki Desk
Update: 2019-08-31 06:40 GMT
కర్ర విరగకుండా పాము(టీడీపీ)ని చంపేస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఇన్నాళ్లు దూకుడుకు మారుపేరుగా ఉండే జగన్.. ఇప్పుడు వ్యూహాత్మకంగా తను అనుకున్న లక్ష్యాన్ని తన చేతికి మట్టి అంటకుండా పూర్తి చేస్తున్న వైనం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ ఇంత తెలివిగా అమరావతి రాజధానిని డీల్ చేస్తున్న వైనం విమర్శకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.

జగన్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని తెరవెనుక ఉండి కూల్ గా నడిపించేస్తున్నారు. మీడియా ప్రచారానికి దూరంగా కరెక్ట్ గా డీల్ చేస్తున్నారు. ఎక్కడా తాను మాట్లాడకుండా.. తనకు మరక రాకుండా కథ నడిపిస్తున్నారు.

తాజాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీకి రాజధాని అమరావతి మార్పుపై రోజుకో మాట మాట్లాడి దాన్ని ప్రజల్లో నానేలా చేశారు. చంద్రబాబు - టీడీపీ ఓ రేంజిలో చెలరేగిపోతున్నా జగన్ మౌనం వీడడం లేదు. మంత్రులను ముందుపెట్టి ఏపీ రాజధానిపై జగన్ స్పందించకపోవడంతో ఆయన ఏం చేస్తాడోనన్న ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతోంది.

తాజాగా టీడీపీనే కాదు.. రాజధానిపై బీజేపీ - సీపీఎం - జనసేన పార్టీలు కూడా రోడ్డెక్కాయి. రాజధాని మార్చవద్దని పవన్ రైతుల వద్దకు వెళ్లారు. అయినా జగన్ నోరు విప్పడం లేదు.

జగన్ చాలా వ్యూహాత్మకంగానే ఈ విషయాన్ని కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల టీడీపీ ఎంతో బదనాం అవుతోంది. జగన్ సైలెంట్ గా ఉంటూనే అమరావతిపై టీడీపీ కుట్రలను మంత్రులతో బయటపెడుతున్నారు. లోకేష్ తోడల్లుడు శ్రీధర్ - సుజనాచౌదరిలు కొన్న భూముల లెక్కలను బయటపెడుతున్నాడు.  అమరావతిపై టీడీపీ చేసిన కుట్రలు - కుతంత్రాలు బయటకు వస్తున్నాయి.

మరో వైపు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు మేలే చేసేలా తాజాగా వారికి ఇవ్వాల్సిన డబ్బులను జగన్ సర్కారు విడుదల చేసింది. రైతులకు కౌలుని చెల్లించింది.

ఇలా జగన్ ఓ వైపు అమరావతిపై మౌనం దాల్చి అది కొనసాగించాలా లేదా అనే విషయంపై ప్రజల స్పందనను చూస్తున్నారు. మరో వైపు టీడీపీని - దాని బినామీలను టెన్షన్ లో పెడుతున్నారు.  అమరావతి భూబాగోతాల్లో టీడీపీ అక్రమాల చిట్టాను బయటపెడుతున్నారు.ఇక రాజధాని రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఏకకాలంలో జగన్ మౌనంగా విభిన్న వ్యూహాలతో పసుపు శిబిరంలో కలవరం పెంచుతున్నారు. రాజధాని విషయంలో జగన్ ఆడుతున్న గేమ్ చూసి ఇప్పుడు టీడీపీకి చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని పొలిటికల్ అనిలిస్టులు చెబుతున్నారు.
Tags:    
  • Jagan 
  • Chandrababu Naidu 
  • Amaravathi 
  • Telugu News 

Similar News

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

Copyright @2026

Powered by Blink CMS