ఈడీ ట్రాప్ లో ఎరక్కపోయి ఇరుక్కుందా?
బాలీవుడ్ నటి జాక్వెలిన్ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుల నేపథ్యంలో ఈనెల 8న మళ్లీ ఢిల్లీలో జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. దీంతో జాక్వెలిన్ మూడవసారి ఈడీ ముందుకు విచారణకు హాజరు కావాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే జాకీని ఈడీ రెండు సార్లు విచారించింది.
పలుమార్లు సమన్లు జారీ చేసినా స్కిప్ కొట్టింది. తదుపరి రెండుసార్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో తప్పక హాజరైంది. ఈ నేపథ్యంలో ఈడీ జాకీ నుంచి కీలక సమాచారం రాబట్టింది. దేశం విడిచి వెళ్లకూడదని లుకౌట్ నోటీసులు కూడా ఈడీ జారీ చేసింది.
ఆదివారం దుబాయ్ విమానం ఎక్కడానికి ప్రయత్నించి విఫలమైంది. చివరికి ఈడీ అనుమతులు ఇవ్వడంతో దుబాయ్ ప్లైట్ ఎక్కగలిగింది. దుబాయ్ లో సల్మాన్ నిర్వహిస్తోన్న `దబాంగ్` షోకి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తాజా పరిస్థితిని బట్టి తెలుస్తోంది.
షో ముగించుకుని అనంతరం ఆమె నేరుగా బుధవారం ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ఈడీ షోకి అనుమతులు ఇవ్వడం వెనుక ఇతర కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
జాకీ దుబాయ్ వెళ్తే కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న వివరాలు కూడా ఆరా తీసే అవకాశం ఉంటుందని...తీగ లాగితే డొంక అంతా కదిలినట్లే దుబాయ్ షో ద్వారా ఇంకా బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరైనా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారా? అన్నది కూడా తెలిసే అవకాశం ఉండటంతోనే తెలివిగా ఈడీ అనుమతులు ఇచ్చినట్లు గుసగుస వినిపిస్తోంది.
ఇప్పటికే నటి నోరా పతేహీ కూడా కేసులో విచారణ ఎదుర్కోంటుంది. ఛార్జ్ షీట్ లో ఇప్పటికే సుకేష్ చంద్రతో పాటు..ఆయన భార్య..నటి లీనా మరియా పాల్ సహా మరో నలుగురు పేర్లు ఉన్నాయి. జాక్వెలీన్..నోరా పతేహీ పేర్లు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.