ఆ హీరోయిన్ పూర్తిగా ఇరుక్కుపోయిందా?

Update: 2022-08-17 10:19 GMT
రూ.200 కోట్ల సుకేష్ చంద్రశేఖర్ స్కాంలో  బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇరుక్కుపోయింది.  పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో కరుడుగట్టిన నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు ఈడీ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఛార్జీ షీట్ దాఖలు వ్యవహారం సంచలనంగా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన సుకేశ్ చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు  చేశారు. అతనిని విచారించిన తరువాత పోలీసుల షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. పైకి చూడ్డానికి మాములుగానే ఉన్నా తాను పలుకుబడి ఉన్న వ్యక్తినని, తనకు పెద్ద పెద్ద నాయకులతో  మంచి సంబంధాలున్నాయని కలరింగ్ ఇస్తారు.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లు జైళ్లో ఉన్న సమయంలో  వారికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పాడు చంద్రశేఖర్. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారిగా వారి భార్యలను కలిసి బెయిల్ ఇప్పిస్తానని, అందుకు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ ను నమ్మిన వారు రూ. 200 కోట్లు అప్పజెప్పారు. ఆ తరువాత వారికి సుకేశ్ కనిపించలేదు.  ఈ డబ్బుతో చెన్నైలోని ఓ బంగ్లా ను కొన్నట్లు వారు పేర్కొన్నారు.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఈడీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా  బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను విచారించారు.  హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న ఈ నటి చంద్రశేఖర్ చేతిలో మోసపోవడం గమనార్హం.  పోలీసుల విచారణలో జాక్వెలిన్ పలు ఆసక్తి విషయాలను చెప్పింది. తిహాడ్ జైలు నుంచే కాలర్ ఐడీ స్పూపింగ్ ద్వారా జాక్వెలిన్ ను చంద్రశేఖర్ కలిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

పెరోల్ పైబయటకు వచ్చిన సుకేష్ హీరోయిన్ జాక్వలెన్ కోసం ప్రైవేట్ జెట్ పంపించి మరీ తమిళనాడుకు తీసుకొని వచ్చి ఆమెతో రాసలీలలు సాగించినట్టు ఈడీ విచారణలో తేలింది. ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సుకేష్ బలవంతపు వసూళ్ల కేసులో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఈడీ గుర్తించింది. జాక్వలైన్ కు సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేయడం ఇటీవల సంచలనంగా మారింది.

జాక్వెలైన్ కు భారీగా ధనం ఇచ్చి ముంబైలోని సముద్ర తీరానికి అభిముఖంగా ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను కానుకగా సుకేష్ ఇచ్చాడని తెలిసింది. సుకేష్ తో ముద్దులు మురిపాలు అన్నీ ఆ అపార్ట్ మెంట్ లోనే సాగాయని తేలింది.

సుకేష్ కుంభకోణంలో జాక్వెలైన్ కు ఆర్థిక సంబంధాలున్నాయని ఈడీ తేల్చింది. రూ.10 కోట్ల మేర లబ్ధి పొందినట్టు ఈడీ గుర్తించింది. 7 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఆధారాలు బలంగా ఉండడంతో జాక్వలైన్ పై కూడా చార్జిషీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఈడీ వర్గాల సమాచారం. దీంతో జాక్వలైన్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
Tags:    

Similar News