గుండెలు అదిరేలా చేస్తున్న శిలాఫలకం

Update: 2020-11-07 09:30 GMT
శిలాఫలకాల్ని పెద్దగా పట్టించుకోం. మన చుట్టూ ఎన్నో శిలఫలాకాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే.. అన్ని ఒకలా ఉండవు. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది ఒక శిలాఫలకం. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పెద్ద చెరువు దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని చూసినంతనే వెన్నులో వణుకు స్టార్ట్ కావటమే కాదు.. ముందుకు అడుగు వేయాలంటేనే భయం వేసేలా చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

శామీర్ పేట పెద్ద చెరువును చూసినంతనే దాన్లో ఈత కొట్టాలని.. సరదాగా స్నానం చేయాలనిపించక మానదు. కానీ.. ఇప్పటివరకు ఆ చెరువులోకి స్నానానికి దిగి ఇప్పటికి 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరంగా మారిన ఈ చెరువులోకి స్నానాలు చేయొద్దని.. సరదాగా ఈత కొట్టొద్దని చెప్పినా ఎవరు వినని పరిస్థితి.

దీంతో.. అధికారులు కొత్త ఆలోచన చేశారు. చెరువును చూడటానికి వచ్చే వారిని హెచ్చరించేందుకు.. వాస్తవ పరిస్థితిని వారికి తెలియజేసేలా వారు ఒక నిలువెత్తు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అందులో 1997 నుంచి 2008 వరకు ఎంత మంది మరణించిన విషయాన్ని చెబుతూ.. 2009 నుంచి ఇప్పటివరకు మరెంత మరణించిన విషయాల్ని తెలియజేస్తూ.. చెరువులో ప్రమాదవశాత్తు మరణించిన వారి పేర్లతో ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. రెండో శిలాఫలకాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ శిలాఫలకంతో సందర్శకుల్లో మార్పు వచ్చిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News