ఆ దేశాలు కరోనా వ్యాక్సిన్ ను కొనడం కష్టమే .... ఎందుకంటే ?
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా ఇంకా సరైన వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రాలేదు. ఇదిగో ..అదిగో .. వ్యాక్సిన్ వచ్చేస్తుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి తప్ప , అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం కొన్ని రకాల వ్యాక్సిన్లు చివరి స్టేజ్ లో ఉన్నాయి. కొన్ని ఇప్పటికే మూడోదశ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని మూడో దశ పరీక్షల్లో ఉన్నాయి. కానీ, ఇవన్నీ ప్రస్తుతానికి లాజిస్టిక్స్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని టీకాల ధరలు అత్యధికంగా ఉన్నాయి. పేద దేశాలు, అలాగే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ధరలు భరించడం కష్టంమే. టీకా తయారీ పోటీలో ఫైజర్ , బియోన్ టెక్ టీకా ముందు నిలిచింది. టీకా పంపిణీకి అత్యవసర అనుమతి లభిస్తే ఇదే మొట్టమొదటి టీకా అవుతుంది. అంతేకాదు మెసెంజర్ ఆర్ ఎన్ ఏ ప్లాట్ ఫారం పై అభివృద్ధి చేసిన మొదటి టీకా కూడా ఇదే కానుంది.
అత్యాధునిక టెక్నాలజీ ఊరకే రాదు. దాని ఖరీదు కూడా అధికంగానే ఉంటుంది. అంతేకాదు అత్యాధునిక టెక్నాలజీ తో తయారు చేసిన టీకాలు ఇప్పుడు లాజిస్టిక్స్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాయి. దీని ధర కూడా అధికమే ఫైజర్ టీకా విషయమే తీసుకుంటే దాని ఖరీదు 39 డాలర్లు. మన రూపాయల్లో 3129. మోడెర్నా కూడా ఫైజర్ టెక్నాలజీ తోనే టీకా అభివృద్ధి చేసింది. దాని ధర కూడా 37 డాలర్లుగా నిర్ణయించారు. అంటే 2960 రూపాయలన్న మాట. ఈ రెండు టీకాలు ఇండియా వంటి దేశాల్లో పంపిణీ చేయడం కష్టం. దీనితో ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఆధారంగా కూడా టీకాల అభివృద్ధి జరుగుతోంది. అడెనోవైరస్ ప్లాట్ ఫారం ఆధారంగా ఆస్ట్రా జెనెకా టీకా అభివృద్ధి చేస్తోంది. రేకంబినెంట్ నానోపార్టికిల్ ప్లాట్ ఫారంపై నోవవాక్స్ టీకా అభివృద్ధి చేస్తోంది. ఈ టీకాల ధర కేవలం 240 రూపాయలు మాత్రమే.
ఫైజర్ ఇప్పటికే యూరోపియన్ యూనియన్ , జపాన్ , అమెరికా , యునైటెడ్ కింగ్డమ్ తో టీకా పంపిణీ కోసం ఒప్పందాలు చేసుకుంది . వచ్చే ఏడాదికల్లా 130 కోట్ల టీకా డోసులు పంపిణీ చేయడానికి ఫైజర్ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియా తో మాత్రం ఇప్పటివరకు ఫైజర్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కోవాక్స్ లో కూడా ఫైజర్ చేరలేదు. ఇక ఇండియా విషయానికి వస్తే కరోనా టీకాల పంపిణీ ఇక్కడ కూడా సమస్యగా మారొచ్చు. దీనికి ప్రధాన కారణం ... ఇండియాలో 27 వేల కోల్డ్ చైన్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో 90 శాతం వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి , రవాణా కు ఉపయోగిస్తున్నారు. కేవలం పది శాతం మాత్రమే ఫార్మా అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి వ్యాక్సిన్ రావడమే కాదు ..కొనడం , పంపిణీచేయడం కూడా కష్టతరం కానుంది.