ఇదెక్కిడి పైశాచికం..నవ్వుతూ అంతమయ్యారు

Update: 2017-02-21 12:34 GMT
ఏం చెబుతారో? ఏం చేస్తారో? అస్సలంటే అస్సలు అర్థం కాదు. పసి హృదయాల్ని మాయ చేసి.. వారిని ఎంత ఉన్మాదులుగా మార్చేస్తారో ఈ వీడియోను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్న ఈ వీడియోను ఐసిస్ రాక్షసులు తాజాగా విడుదల చేశారు. ఐసిస్ సూసైడ్ బాంబర్లుగా అవతారం ఎత్తిన ఇద్దరు టీనేజర్లు..నవ్వుతూ కెమేరాలకు ఫోజులిచ్చి.. రైఫిళ్లు చేతబట్టుకొని.. బాంబులతో కూడిన కారును డ్రైవ్ చేసుకుంటూ ఒక చోట వాహనాన్ని ఆపేసి.. తమను తామును పేల్చేసుకున్నారు.

ఏ మాత్రం భయం లేకుండా.. చనిపోతామన్న ధ్యాసలేని వారి వైనం ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇరాక్ లోని యాజిడి ప్రాంతాల్లోని ఈ కుర్రాళ్లు తీరును చూస్తున్న వారికి నోట మాట రావటం లేదు. ముక్కుపచ్చలారని జీవితాన్ని తమకు తాము అంతం చేసుకుంటున్న తీరు ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తోంది. చిన్నచిన్న పిల్లల్ని సూసైడ్ బాంబర్లుగా మార్చటం ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు మామూలే. ఇలా ఎంతమందిని మార్చారో.. ఏం చెప్పి మారుస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారింది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News