పేరుకే గూఢాచార సంస్థ కానీ బుద్ధి ఐఎస్ లానే..

Update: 2015-11-30 09:18 GMT
పేరుకు గూఢాచార సంస్థ కానీ చేసవన్నీ దరిద్రపు పనులేనన్న విషయం పాక్ కు చెందిన ఐఎస్ ఐ విషయంలో మరోసారి నిరూపితమైంది. దేశ రక్షణ కోసం వినియోగించాల్సిన గూఢాచార సంస్థ.. ఇస్లామిక్ స్టేట్ మాదిరి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న వాదనకు బలం చేకూరేలా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో దేశ రహస్యాల్ని పాక్ కు తరలించే కొందరిని అదుపులోకి తీసుకోవటం తెలిసేందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానిత ఐఎస్ ఐ ఏజెంట్ మహ్మద్ ఇజాజ్ మాటలు వింటే.. ఐఎస్ ఐ సంస్థ వ్యవహారాలన్నీ ఉగ్రవాదులకు తలదన్నేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ లో గూఢచర్యం కోసం అతన్ని పాక్ నుంచి బంగ్లాదేశ్ మార్గం ద్వారా భారత్ లోకి అక్రమంగా పంపినట్లుగా తేలింది. ఇజాజ్ ను భారత్ కు పంపే సమయంలో అతని పాస్ పోర్ట్ ను ధ్వంసం చేసినట్లుగా అతడు చెప్పుకొచ్చాడు. అంటే.. భారత్ కు కానీ అతగాడు పట్టుబడితే.. అతని జాతీయత తెలుసుకునే అవకాశం లేకుండా చేయటంతో పాటు.. అతను భారత్ నుంచి తిరిగి వెళ్లలేని పరిస్థితి సృష్టించినట్లుగా తెలుస్తోంది.

ఐఎస్ తీవ్రవాదులు సైతం.. తమ దగ్గరకు వచ్చే వారి పాస్ పోర్ట్ లను తగలేసి.. శాశ్వితంగా తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తుంటారు. ఐఎస్ఐ కూడా దాదాపు అలాంటి పనులకు పాల్పడటం గమనార్హం. ఇజాజ్ ను భారత్ కు పంపే సమయంలో రహస్య సమాచారాన్ని ఎలా సేకరించాలి.. వాటిని పాక్ కు పంపాలో శిక్షణ ఇచ్చినట్లుగా తేలింది. నెలకు రూ.50వేల జీతం.. చెల్లెలు పెళ్లి ఘనంగా చేస్తామన్న మాటతో తానీ రొచ్చులోకి దిగినట్లుగా ఇజాజ్ చెబుతున్నారు. కానీ.. ఐఎస్ ఐ తాను ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోలేదని ఇజాజ్ చెప్పినట్లుగా చెబుతున్నారు. తనను మోసగించిన ఐఎస్ ఐకి విధేయతతో పని చేస్తున్న ఇజాజ్ ఎలాంటి సమాచారాన్ని పాక్ కు అందించాడా? అన్నది ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూస్తుంటే. ఇజాజ్ లాంటి వారిని ఎంతమందిని ఐఎస్ఐ భారత్ కు పంపిందో..?
Tags:    

Similar News