• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్లో వైజాగ్ కు...

నవంబర్లో వైజాగ్ కు మారబోతున్నారా?

By - Tupaki Desk
Update: 2022-10-14 06:34 GMT
దీపావళి పండుగ తర్వాత అంటే నవంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు తరలి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైజాగ్ లో క్యాంపు కార్యాలయం నిర్మాణం దాదాపు అయిపోవచ్చింది. మూడు రాజదానుల ప్రతిపాదనకు తాను కట్టుబడున్నట్లు ఇఫ్పటికే జగన్ చాలాసార్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జనాల్లో తన ప్రకటనపైన నమ్మకం ఉండేట్లుగా దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్లో ఒక ముహూర్తం చూసుకుని వైజాగ్ ఫిష్ట్ అవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ విషయం చెప్పటానికే గవర్నరన్ బిశ్వభూషణ్ హరిచందన్ను సీఎం కలిశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. వీళ్ళిద్దరి భేటీలో మూడు రాజధానుల అంశం, వైజాగ్ లో ప్రజాగర్జన పేరుతో జరగబోయే బహిరంగసభ, అమరావతి పాదయాత్ర లాంటి అనేక అంశాలపై గవర్నర్ కు జగన్ వివరణ ఇచ్చారట.

ఇప్పటికే విశాఖకు జగన్ వెళిపోతున్నారంటు చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజాలు కాలేదు. అయితే రాబోయే నవంబర్లో క్యాంపాఫీను తరలించటం మాత్రం ఖాయమంటున్నారు.

నవంబర్లో వైజాగ్ వెళ్ళటం ఖాయమని ఎందుకంటున్నారంటే అక్కడ క్యాంపు ఆఫీసు నిర్మాణం దాదాపు పూర్తయిపోవచ్చిందట. కనీసం వారానికి మూడురోజులు విశాఖలోనే కూర్చుని ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారంపై జగన్ దృష్టిపెట్టబోతున్నట్లు పార్టీవర్గాలంటున్నాయి.

దీనివల్ల వచ్చే ఎన్నికలనాటికి ఉత్తరాంధ్రలోని మూడుజిల్లాల్లోని చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నట్లు నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్రలో రాజధాని సెంటిమెంటు పెరిగిపోతోందని వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు.

ఈ దశలో పూర్తిస్ధాయి రాజధాని రాకపోయినా కనీసం క్యాంపుఆఫీసున్నా వచ్చేస్తే జనాలు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటారనేది వైసీపీ నేతల ఆలోచన. ఇదే విషయాన్ని చాలాసార్లు నేతలు జగన్ కు స్పష్టంచేశారట. అందుకనే క్యాంపాఫీసు నిర్మాణాన్ని స్పీడుచేశారు. ఇపుడా నిర్మాణం కూడా పూర్తయిపోవచ్చింది కాబట్టి నవంబర్ నుండి జగన్  వైజాగ్ లో కూర్చోవటానికి పరిస్ధితులు సానుకూలంగా ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • VishakapatnamYCPCampOffice 
  • APPolitics 
  • YSRCPGovernment 
  • YSJaganMohanReddy 
  • YSRCPLeaders 
  • APCapital 
  • PoliticalNews 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS