రాహుల్ గాంధీ డ్రెస్ కోడ్ ఛేంజ్ చేసింది అందుకేనా?
కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఇంతకు ముందు ఎప్పుడు కనిపించినా వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా డ్రెస్ వేసుకునేవారు. కానీ.. ఈ మధ్య డ్రెస్ స్టైల్లో మార్పు వచ్చింది. బ్రాండెడ్ షర్ట్స్, ఆఫీస్ క్యాజువల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ డ్రెస్ కోడ్ తో స్టూడెంట్స్, విద్యావంతువలతో మీటింగులు పెడుతున్నారు రాహుల్. దీంతో.. ఏంటీ మార్పు? ఎందుకిలా డ్రెస్ కోడ్ ఛేంజ్ చేశారని కాంగ్రెస్ వాదులు చెవులు కొరుక్కుంటున్నారట.
అయితే.. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. అదేమంటే.. దేశంలో 45 సంవత్సరాల వయసు లోపున్న జనాభా ఏకంగా 43 శాతం ఉందట. వాళ్లని తనవైపు తిప్పుకునేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. వాళ్లకు దగ్గర కావడానికి, యూత్ ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న రాహుల్.. ఇందులో భాగంగానే డ్రెస్ కోడ్ కూడా ఛేంజ్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదేవిధంగా.. దేశంలో మోడీ వేవ్ తగ్గుతోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఎడ్యుకేటెడ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నారట కాంగ్రెస్ నేత. ఇందులో భాగంగానే డ్రెస్ కోడ్ తోపాటు స్పీచ్ స్టైల్ కూడా మార్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. స్పీచ్ లో పంచ్ డైలాగ్స్ ఉండేలా చూసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. ఎలాగో పెళ్లి కాలేదుకాబట్టి.. కొంతకాలం యూత్ కేటగిరీలోనే కొనసాగి.. టార్గెట్ రీచ్ కావాలని చూస్తున్నారట రాహుల్.
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి ఇంకా చాలా మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ప్రధానంగా విద్యార్థుల మీదనే దృష్టిపెట్టిన రాహుల్.. వారితోనే తన టీమ్ కూడా ఫామ్ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ప్రతీ రాష్ట్రంలో తన మార్కు చూపించే లీడర్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం. ఇలా అన్ని రాష్ట్రాల నుంచీ మెరికల్లాంటి నేతలను ఎన్నుకొని తనదైన బృందాన్ని సిద్ధం చేసుకోవాలని చూస్తున్నాడట. ఇప్పటి వరకూ ఉన్న టీమ్ లో అందరూ వయసైపోయిన వాళ్లు ఉండడం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. మరి.. రాహుల్ గాంధీ కొత్త డ్రెస్ కోడ్, సరికొత్త ఆలోచనలు ఏ మేరకు రాణిస్తాయో చూడాలి.