జగన్ కు వ్యక్తిగత ఇమేజే ముఖ్యమా ?
జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజీయే ముఖ్యమా ? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు మాటల ప్రకారం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ ఏర్పడినపుడు రు. 86 వేల కోట్లున్న అప్పులు ఏడేళ్ళలో రు. 7 లక్షల కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలపైన మాత్రమే దృష్టిపెట్టినట్లు ఆరోపించారు.
అభివృద్ధి గురించి కేవలం సంక్షేమ పథకాలపైన మాత్రమే ప్రభుత్వం దృష్టిపెడితే ఏ ప్రభుత్వానికైనా కష్టమే అని ఐవైఆర్ మండిపడ్డారు. గృహనిర్మాణ పథకంకు సంబంధించి కాంట్రాక్టర్లను ఆహ్వానిస్తు ఆర్డీవో సమావేశం నిర్వహించటాన్ని ఐవైఆర్ తప్పుపట్టారు. ఈ సమావేశంతోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అర్ధమైపోతోందన్నారు. ఏపి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులను దేశంలోని మరే రాష్ట్రమూ ఎదుర్కోవటం లేదన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి గురించి ఏమాత్రం పట్టించుకోని జగన్ కేవలం తన వ్యక్తిగత ఇమేజీకి మాత్రమే పాకులాడుతున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఘోరంగా ఉందని ఐవైఆర్ చెప్పింది వాస్తవమే కానీ దీనికి కారణం ఏమిటనేది మాత్రం చెప్పలేదు. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల అప్పుల విషయాన్ని కూడా ప్రస్తావించుంటే బాగుండేది. దీంతో పాటు కేంద్రప్రభుత్వం ఎంత అప్పుల్లో ఉందనే విషయాన్ని కూడా ఐవైఆర్ చెప్పుండాలి.
తాజా లెక్కల ప్రకారం కేంద్రప్రభుత్వం 122 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. 70 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు చేసిన అప్పులకన్నా ఏడేళ్ళ ఎన్డీయే ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువ. నరేంద్రమోడి కూడా వ్యక్తిగత ఇమేజి కోసం ఎంతగా పాకులాడుతున్నారో బహుశా ఐవైఆర్ మరచిపోయినట్లున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు రు. 5-6 లక్షల కోట్ల అప్పుల్లోనే ఉన్నాయి. మొత్తానికి ఐవైఆర్ చెప్పేదేదో చెప్పారు. సంక్షేమం-అభివృద్ధిని ప్రభుత్వాలు బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పిన మాట వాస్తవమనే చెప్పాలి.