బూస్టర్ డోస్ మీద మోడీ మనసులో మాట చెప్పలేక మోహమాటపడుతున్నారా?
శనివారం రాత్రి అనూహ్యంగా జాతి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ మాటల్ని జాగ్రత్తగా.. లైన్ టు లైన్ ఒకటికి రెండుసార్లు పట్టి చూస్తే.. కొన్ని మాటల కింద అండర్ లైన్ గీసుకొని.. చదివినప్పుడు ఆయన పడుతున్న మొహమాటం.. ఇమేజ్ కు నష్టం వాటిల్లకూడదన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు కనిపిస్తుంది. పిల్లలకు వ్యాక్సినేషన్.. పెద్ద వయస్కులు.. వైద్యులు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోసుల్ని కొత్త సంవత్సరం మొదట్లో ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన తేదీల్ని వెల్లడించారు.
ఇక్కడ మోడీ మొహమాట పడింది ఎక్కడంటే.. బూస్టర్ డోసు విషయంలో. అదెలా చెప్పగలమంటే.. కొవిడ్ టీకా కార్యక్రమాన్ని ఎంత ఖర్చు అయినా సరే.. కేంద్రం భరించి అందరికి ఉచితంగా వేస్తామని మాట ఇవ్వటాన్ని మర్చిపోకూడదు. మొదట్లో కేంద్రం కొంత.. రాష్ట్రాలు కొంత వాటాలు వేసుకోవాలనుకోవటం.. వ్యాక్సిన్ విషయంలో అనుసరించిన వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని.. కీలకమైన టీకా విషయంలో కేంద్రం ఆ మాత్రం ఖర్చు చేయలేదా? అంటూ ప్రశ్నలు రావటం తెలిసిందే.
ఈ క్రమంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాధ్యత మొత్తం కేంద్రానిదేనంటూ అప్పట్లో మోడీ సర్కారు ప్రకటించారు. దీంతో.. బూస్టర్ డోసు విషయంలోనూ కేంద్రానిదే బాధ్యత అవుతుంది. ఇంకా మొదలు కాని పిల్లల వ్యాక్సినేషన్ ఖర్చు కేంద్రానిదే. ఈ క్రమంలో.. ఒకేసారి ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వారికి బూస్టర్ డోసులు.. పిల్లలకు వ్యాక్సిన్ అంటే అదో భారీ ప్రోగ్రాం అవుతుంది. దేశ వ్యాప్తంగా బూస్టర్ డోసు వేయటం అన్నది అంత తేలికైన విషయం కాదు. కోట్లాది మందికి బూస్టర్ డోసు వేయాలంటే.. భారీగా ఖర్చు అవుతుంది.పిల్లలకు వేసే వ్యాక్సిన్ ఖర్చుకు ఇది అదనం.
ఇలాంటివేళలో మోహమాటాలకు పోకుండా.. ప్రభుత్వం వ్యాక్సిన్ వేస్తుందని.. ప్రైవేటులో కూడా వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా వేసుకోవాలన్న మాట వస్తే మంచిది. కానీ.. ఆ మాట ప్రధాని మోడీ నోటి నుంచి వస్తే.. విపక్షాలు విరుచుకుపడటమే కాదు.. మరో మూడు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీదా ప్రభావం పడుతుంది. ప్రజల మీద భారం మోపుతారా? అంటూ విపక్షాలు విరుచుకుపడటం ఖాయం. అందుకేనేమో.. బూస్టర్ డోసు విషయంలో తొలి దశలో కేవలం మూడు వర్గాల వారికి (జబ్బులతో ఇబ్బంది పడే పెద్ద వయస్కులు.. డాక్టర్లు.. ఫ్రంట్ లైన్ వారియర్లు)మాత్రమే బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.
మరి.. మిగిలినవారి పరిస్థితి ఏమిటంటే.. దశల వారీగా టీకా కార్యక్రమాన్నినిర్వహించటం. ఒమిక్రాన్ తో పాటు.. ఇతర మ్యూటెంట్ వేరియంట్లు విరుచుకుపడే వేళ.. బూస్టర్ డోసు అవసరం చాలా ఉంటుంది. కానీ.. కేంద్రం మాత్రం కొందరికే అనుమతి ఇవ్వటం వల్ల..మిగిలిన వారంతా తమ టైం వచ్చే వరకు వెయిట్ చేయక తప్పని పరిస్థితి. దీనికి బదులుగా.. బూస్టర్ డోసును అందరూ వేసుకోవచ్చని.. బూస్టర్ డోసు వరకు కేంద్రానికి బాధ్యత లేదని ప్రకటిస్తేనే మంచిది. ఆర్థికంగా భారం అయినా.. దేశ ప్రజలకు బూస్టర్ డోసు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
కానీ.. అలాంటి ప్రకటన చేస్తే..రాజకీయంగా జరిగే నష్టం గురించి అవగాహన ఉన్న మోడీ.. ఆచితూచి అన్నట్లుగా మూడు వర్గాలకు బూస్టర్ డోసు మొదలు పెట్టనున్నట్లుగా వెల్లడించారు. బూస్టర్ డోస్ అన్నది అవసరమైతే.. అది అందరికి అవసరమే. కానీ.. ఆ మాట చెబితే.. భారీ క్యూలైన్లు.. వ్యాక్సిన్ కోసం హడావుడి మొదలువుతుంది. దీని వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే.. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు.. మోహమాట పడుతూ మోడీ బూస్టర్ డోసు ప్రకటన వెలువడిందని చెప్పక తప్పదు.