ట్రంప్‌కు సెగ: ఇరాన్‌తో యుద్ధం వద్దు.. తేల్చేసిన సెనేట్
ఇరాన్‌తో యుద్ధానికి దిగి, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పతనానికి, కదిలిపోవడానికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ సెగ తగిలింది.
ఇరాన్‌తో యుద్ధానికి దిగి, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పతనానికి, కదిలిపోవడానికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ సెగ తగిలింది. ఇప్పటి వరకు ఆయన అధ్యక్షుడిగా తనకు ఉన్న విశేష అధికారాలను వినియోగించి.. ఇరాన్‌పై ఏ కపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న వాదన ఉంది. అయితే.. ఈ అధికారాలు.. కేవలం 90 రోజులకు మాత్రమే పరిమితం అవుతాయి. ఆ తర్వాత.. సెనేట్(చట్టసభ) ఆమోదం పొందితే.. మళ్లీ 90 రోజుల వరకు ఆ అధికారులు లభిస్తాయి.
ఈ క్రమంలో ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించి.. దాదాపు 60 రోజులపైగా కొనసాగించిన ట్రంప్.. తన విశేష అధికారాలను కోల్పోయారు. తాజాగా మరోసారి.. తన అధికారాలను రెన్యువల్ చేసుకునేందుకు సెనేట్‌లో బిల్లు పెట్టారు. తాజాగా బుధవారం(భారత కాల మానం ప్రకారం మంగళవారం) సెనేట్లో ఈ బిల్లు రాగా.. విపక్ష సభ్యులు పూర్తిగా దీనిని వ్యతిరేకించారు. అయితే.. విశేష అధికారాలు ఇచ్చేందుకు ఎవరూ కాదన లేదు. కానీ, ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు వీల్లేదని తీర్మానం చేశారు.
అంతేకాదు.. ఇరాన్ చుట్టుపక్కల భూ ఉపరితలంపైనా.. హోర్ముజ్ జలసంధి సహా.. గల్ఫ్ ప్రాంతంలోని సముద్ర జలాలపైనా అమెరికా సేనలను మోహరించడాన్ని కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. సేనలు ఇలానే కొనసాగితే.. ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గవని అభిప్రాయపడిన సభ్యులు తక్షణమే భూమి సహా.. సముద్రంపై మోహరించిన అమెరికా సైనికులను వెనక్కి పిలవాలని తీర్మానంలో స్పష్టం చేశారు.దీనికి సంబంధించిన విశేష అధికారాలకు తాము అంగీకరించేది లేదన్నారు.
వాస్తవానికి.. అమెరికా సేనలు కొనసాగుతాయని.. యుద్ధం ముగిసినా.. శాంతి ఒప్పందం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు వారిని వెనక్కి పిలిచేది లేదని ట్రంప్ ప్రకటించిన 48 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే.. ఇప్పుడు సెనేట్ తాజాగా తీర్మానం ఆమోదించింది. దీనికి 50 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది.మరోవైపు.. శాంతి ఒప్పందం కుదిరినా.. అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.