ముగ్గురితో ఎఫైర్.. సంచలన విషయాలు బయటపెట్టిన బిల్ గేట్స్
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయాలను ఆయన స్వయంగా అంగీకరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ కోటీశ్వరుడు బిల్ గేట్స్ మరోసారి అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న పరిచయాల వల్ల విమర్శలు ఎదుర్కొంటున్న గేట్స్.. తాజాగా అమెరికా చట్టసభ్యుల దర్యాప్తులో కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయాలను ఆయన స్వయంగా అంగీకరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
వివాహేతర సంబంధాలను అంగీకరించిన గేట్స్?
అమెరికా నిఘా, న్యాయ సంస్థల దర్యాప్తులో భాగంగా బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితంపై నోరు విప్పినట్లు తెలుస్తోంది. గతంలో తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆయన అంగీకరించినట్లు లీకైన నివేదికలు చెబుతున్నాయి. ఆ ముగ్గురు మహిళల వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. వారిలో
రష్యాకు చెందిన ప్రముఖ బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, రష్యాకే చెందిన ఒక అణు శాస్త్రవేత్త కరీమా నిగ్మాటులీనా, వైద్య రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి డాక్టర్ అలీస్ జాకోబ్స్ ఈ ముగ్గురితో తనకు ఉన్న సంబంధాల గురించి దర్యాప్తు అధికారుల ముందు బిల్ గేట్స్ కీలక విశ్లేషణ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.
ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు
అయితే ఈ వ్యవహారంలో మరో కీలక లింక్ బయటపడింది. బిల్ గేట్స్‌కు ఉన్న ఈ ముగ్గురు మహిళల వ్యక్తిగత సంబంధాల గురించి వివాదాస్పద వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ముందే తెలిసిందని సమాచారం. దీనినే ఆసరాగా చేసుకుని.. బిల్ గేట్స్‌ను ఎప్‌స్టీన్ తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని నివేదికలు వెల్లడించాయి. తన మాట వినకుంటే ఈ విషయాలను బయటపెడతానని ఎప్‌స్టీన్ బెదిరించినట్లు తెలుస్తోంది. "ఎప్‌స్టీన్‌తో నాకు ఉన్న పరిచయం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటి. అతనితో సమావేశాలు జరపడం వల్ల నా ప్రతిష్ఠకు, వ్యక్తిగత జీవితానికి తీవ్ర నష్టం జరిగింది." అని బిల్ గేట్స్ గతంలోనే పలుమార్లు బహిరంగంగా అంగీకరించిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయంగా మళ్లీ రేగిన దుమారం
ఈ తాజా పరిణామాలతో జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు మళ్లీ అంతర్జాతీయంగా చర్చల్లోకి వచ్చింది. ఇప్పటికే ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్న ప్రపంచ స్థాయి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులపై అనేక ఆరోపణలు, దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బిల్ గేట్స్ వెల్లడించినట్లు చెబుతున్న ఈ అంశాలు అమెరికా రాజకీయ, న్యాయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
అయితే ఈ ఆరోపణలు, మీడియాలో వస్తున్న వివరాలపై సంబంధిత అమెరికన్ దర్యాప్తు సంస్థల నుంచి ఇంకా అధికారిక తుది నివేదిక వెలువడాల్సి ఉంది. గేట్స్ ప్రతినిధులు సైతం ఈ లీకులపై స్పందించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుకున్న ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.