లోకేష్ ఏపీకి భారమా? లేక టీడీపీకి భారమా?

Update: 2021-04-24 02:30 GMT
ఏపీ టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ గురించి స్వయంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. 'లోకేష్ ఉండగా టీడీపీ బాగు పడదన్నట్టు' ఆయన వీడియోలో అన్నట్టుగా ఉన్న మాటలు వైరల్ అయ్యాయి. ఇలాంటి సందు దొరికితే దూసుకుపోయే రాంగోపాల్ వర్మ అదునుచూసి దీన్ని క్యాష్ చేసుకున్నాడు.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లతో చిన్నబాబు లోకేష్ పై విరుచుకుపడ్డాడు. 'లోకేష్  టీడీపీకి భారం అని.. వెంటనే టీడీపీని కాపాడడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఆయనకు ట్యాగ్ చేశాడు.  తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనే వైరస్ పట్టుకుందని వర్మ ఆరోపించారు. అది ప్రాణాంతక వ్యాధి అని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు ఆ వైరస్ నివారణగా పనిచేసే ఏకైక టీకా ఉందని.. దానిపేరే 'తారక్9999' అని జూనియర్ ఎన్టీఆర్ కు ట్యాగ్ చేస్తూ వర్మ సూచించాడు. టీడీపీ కార్యకర్తలంతా తన సలహా వినాలని వర్మ సూచించాడు. తెలుగుదేశం పార్టీకి తారక్ టీకా వేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. లేదంటే మీరందరూ ఆ వైరస్ బారిన పడి చచ్చిపోతారంటూ హెచ్చరించారు.

గతంలో కూడా టీడీపీని, చంద్రబాబును వర్మ వదల్లేదు. గతంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అని ఏకంగా చంద్రబాబును టార్గెట్ చేసి విలన్ చేశారు. టీడీపీకి అసలు వారసుడు నారా లోకేష్ కాదని.. ఆ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ది అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల కూడా వర్మ చేసిన 'లోకేష్ వైరస్' అనే ట్వీట్ సంచలనంగా మారింది.  

వర్మ ట్వీట్ ను బట్టి నారా లోకేష్ పార్టీకి భారమే అన్న భావం టీడీపీ నేతల్లోనూ ఉందని తేటతెల్లమైంది. ఇటీవల కుప్పం ప్రచారంలోనూ చంద్రబాబు ఎదురుగానే నారా లోకేష్ రావాలన్న నినాదాలు వినిపించాయి. ఇది  మరింతగా బలపడడానికా అన్నట్లుగా వర్మ సరైన టైమ్ చూసుకునే ఈ దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు.

ఏపీకి భావి ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను చంద్రబాబు, టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే టీడీపీ వారసత్వాన్ని అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యాలు మాత్రం నారాలోకేష్ లో లోపించాయని టీడీపీ నేతల్లో ఒక బలమైన భావన ఉంది. లోకేష్ టీడీపీకే కాదు ఏపీకి భారమేనన్న ప్రచారం ఉంది.
Tags:    

Similar News